న్యూజిలాండ్ క్రికెట్ చరిత్రలో మొదటిసారి.. ఆ జట్టుపై టెస్ట్ సిరీస్ కైవసం

by Mahesh |
న్యూజిలాండ్ క్రికెట్ చరిత్రలో మొదటిసారి.. ఆ జట్టుపై టెస్ట్ సిరీస్ కైవసం
X

దిశ, వెబ్‌డెస్క్: న్యూజిలాండ్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇంతవరకు ఒక్కసారి కూడా సౌతాఫ్రికా జట్టుపై టెస్ట్ సిరీస్ గెలవలేదు. కాగా ఈ సుదీర్ఘ రికార్డు తాజాగా కేన్ విలియమ్సన్ నేతృత్వంలోని జట్టు బ్రేక్ చేసింది. మొదటి టెస్టులో అనూహ్య విజయం సాధించిన న్యూజిలాండ్ రెండో టెస్టులోను గెలిచిన సౌతాఫ్రికా జట్టుకు షాక్ ఇచ్చింది. అనుభవం లేని జట్టుతో భరిలోకి దిగిన కేన్ విలియమ్సన్.. టెస్ట్ సిరీస్ ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. దీంతో న్యూజిలాండ్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారి సౌతాఫ్రికా జట్టుపై టెస్ట్ సిరీస్ ను కైవసం చేసుకుంది. 1932లో తొలిసారిగా తలపడిన తర్వాత దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ 18 టెస్టు సిరీస్‌లు ఆడింది. వీటిలో 17 సిరీస్‌లలో సౌతాఫ్రికగా 13 సిరీస్ లను గెలుచుకొగా.. మిగిలినవి డ్రాగా ముగిశాయి.

ఇదిలా ఉంటే రెండో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా జట్టు కేవలం 242 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం న్యూజిలాండ్ జట్టు కూడా 211 పరుగుల స్వల్ప స్కోరుకే ఆలౌట్ అయ్యారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లోను 235 పరుగలకే సౌతాఫ్రికా జట్టు ఆలౌట్ అయింది. దీంతో 267 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన న్యూజిలాండ్ జట్టు.. 117 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. అనంతరం బరిలోకి వచ్చిన విలియమ్సన్.. 133 పరుగులతో రాణించాడు. అలాగే విల్ యంగ్ 60 పరుగులతో రాణించడంతో 94.4 ఓవర్లకు న్యూజిలాండ్ లక్ష్యాన్ని చేదించి.. సౌతాఫ్రికపై తన మొట్టమొదటి టెస్ట్ సిరీస్ ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది.

Next Story