చిన్ననాటి కోచ్‌కు థాంక్యూ.. విరాట్ కోహ్లీ ఎమోషనల్ పోస్ట్

by Disha Web Desk 13 |
చిన్ననాటి కోచ్‌కు థాంక్యూ.. విరాట్ కోహ్లీ ఎమోషనల్ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: టీమ్ ఇండియా రన్ మిషన్ విరాట్ కోహ్లీ చిన్ననాటి కోచ్‌కు థాంక్యూ చెప్తూ.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్టు పెట్టాడు. తన కెరీర్‌లో చిన్ననాటి కోచ్‌ రాజ్‌కుమార్ శర్మ పాత్ర ఎంతో కీలకం అంటూ తన గురువుకు కృతజ్ఞతలు తెలిపాడు. "నాకు కేవలం కోచ్‌గానే కాకుండా.. ఒక మెంటార్‌గా నా ప్రయాణంలో నా వెంటే ఉండి మద్దతుగా నిలిచిన రాజ్‌కుమార్ శర్మ సర్‌కు నేను జీవితాంతం రుణపడి ఉంటాను" అని తన గురువుకు ధన్యవాదాలు తెలిపాడు. అక్కడితో ఆగకుండా తనను అందరి కన్నా ఎక్కువగా నమ్మినందుకు కృతజ్ఞతలు కూడా తెలియజేశాడు.

"నేను పెద్ద పెద్ద కలలు కన్న పిల్లాడిని. ఆ కలలపై మీరు ఉంచిన నమ్మకం వల్లనే పదిహేనేళ్ల క్రితం నేను టీమిండియా జెర్సీ వేసుకోగలిగా. మీరు నేర్పిన పాఠాలు, ఇచ్చిన సలహాలు, తప్పు చేసినప్పుడు కొట్టిన మొట్టికాయలు, బాగా ఆడినప్పుడు శభాష్ అని వీపు తట్టడం ఇవేమీ నేను మర్చిపోలేను. నా కలలను కూడా మీ కలలుగా మోసినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు చెప్తున్నా" అని పోస్టు పెట్టాడు. కోహ్లీ 9 ఏళ్ల వయసు నుంచే రాజ్‌కుమార్ వద్ద శిక్షణ తీసుకున్నాడు. ఆ వయసులోనే కోహ్లీ ట్యాలెంట్ గుర్తించిన రాజ్‌కుమార్ శర్మ.. అతని కోసం ప్రత్యేకమైన కోచింగ్ రెజిమెన్ తయారు చేశాడు.

Next Story

Most Viewed