IND vs ENG: టాస్ గెలిచిన ఇంగ్లాండ్ .. భారత జట్టులోకి కీలక మార్పులు?

by Mahesh |
IND vs ENG: టాస్ గెలిచిన ఇంగ్లాండ్ .. భారత జట్టులోకి కీలక మార్పులు?
X

దిశ, వెబ్ డెస్క్: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్ (Second ODI match) కటక్ వేదికగా జరుగుతుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ (England won the toss) జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో భారత జట్టు (Indian team) బౌలింగ్ చేయనుంది. మొదటి మ్యాచ్లో గాయం కారణంగా ప్లేయింగ్ 11లో చోటు కోల్పోయిన స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) తిరిగి జట్టులోకి వచ్చాడు. అలాగే టీ20 సిరీస్ లో అద్భుతమైన ప్రదర్శన తో ఆకట్టుకున్న మిస్టీరియస్ స్పిన్నర్ (Mysterious Spinner) వరుణ్ చక్రవర్తి (Varun Chakraborty).. తన వన్డే మ్యాచ్ అరంగేట్రం (ODI match debut)చేశాడు. దీంతో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) స్థానం కోల్పోయాడు. మూడు మ్యాచుల ఈ సిరీస్ (series)లో భారత్ ఈ రోజు గెలిస్తే సిరీస్ కైవసం చేసుకోనుంది. ఈ క్రమంలో ఇంగ్లాండ్ జట్టు ఎలాగైన ఈ మ్యాచులో విజయం సాధించాలనే తపనతో మ్యాచ్ లోకి వస్తుంది. ఇందుకోసం తుది జట్టులో మూడు మార్పులను చేసిన ఇంగ్లాండ్.. తమ జట్టులోకి Mark Wood, Gus Atkinson, Jamie Overton లను తీసుకొంది. మరీ ఈ మార్పులు ఇంగ్లాండ్ జట్టు (England team)కు ఏ విధంగా కలిసొస్తాయో తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి.

ఇంగ్లాండ్ ప్లేయింగ్ XI: ఫిలిప్ సాల్ట్(w), బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(c), లియామ్ లివింగ్‌స్టోన్, జామీ ఓవర్టన్, గుస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, సాకిబ్ మహమూద్

భారత్ ప్లేయింగ్ XI: రోహిత్ శర్మ(సి), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(w), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహమ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి

Next Story

Most Viewed