- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నైట్ క్లబ్ ఎఫెక్ట్.. ఇంగ్లండ్ కెప్టెన్ స్టోక్స్ రిటైర్మెంట్ ?
ఇంగ్లండ్ కెప్టెన్ స్టోక్స్ రిటైర్మెంట్ చేసే యోచనలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: న్యూజిలాండ్ పై టెస్ట్ మ్యాచ్ గెలిచిన తర్వాత ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ నైట్ క్లబ్ కు వెళ్లి వివాదంలో చిక్కుకున్నాడు. అక్కడితో ఆగకుండా క్లబ్ లో గొడవకు కూడా దిగినట్లు ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. అయితే ఈ సంఘటనపై ఇప్పటికే ఇంగ్లండ్ బోర్డు విచారణ మొదలు పెట్టింది. ఏ క్షణమైనా బెన్ స్టోక్స్ పై క్రమ శిక్షణ చర్యలు తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ECB చర్యలు తీసుకోకముందే... తానే రిటైర్మెంట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాడట స్టోక్స్.
ఈ మేరకు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే టీ20లు, వన్డేల నుంచి బెన్ స్టోక్స్ తప్పుకున్నాడు. కేవలం టెస్టుల్లోనే కొనసాగుతున్నాడు. ఇక నైట్ క్లబ్ వివాదం నేపథ్యంలో ఇంగ్లండ్ బోర్డు యాక్షన్ తీసుకోకముందే రిటైర్మెంట్ ఇచ్చి.. ఆ వివాదం నుంచి బయటపడాలని స్కెచ్ వేశాడట. నిజంగానే టెస్టుల నుంచి బెన్ స్టోక్స్ తప్పుకుంటే... అతని 15 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ ముగిసినట్లు అవుతుంది. మరి బెన్ స్టోక్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.






