- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- ఆరోగ్యం
- ఫోటోలు
- ఉగాది రాశి ఫలాలు
- Job Notifications
- OTT Release
- భక్తి
ఏటీపీ ర్యాంకింగ్స్: జొకోవిచ్‌కు మళ్లీ టాప్ ర్యాంక్

న్యూఢిల్లీ: ఈ ఏడాది తొలి గ్రాండ్ శ్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను గెలిచిన నోవక్ జొకోవిచ్ వరల్డ్ టెన్నిస్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. మొత్తం 22 గ్రాండ్ శ్లామ్ టైటిల్స్ గెలిచిన సెర్బియా జొకోవిచ్ సోమవారం విడుదలైన ఏటీపీ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్‌గా నిలిచాడు. 35 ఏళ్ల జొకోవిచ్ నాలుగు స్థానాలు ఎగబాకి స్పెయిన్‌కు చెందిన కార్లోస్ అల్కరాజ్‌కు చెందిన స్థానాన్ని ఆక్రమించాడు. గాయం కారణంగా ఈ టోర్నీకి దూరమైన కార్లోస్ అల్కరాజ్ రెండో స్థానంలో నిలిచాడు. జొకోవిచ్‌కు ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ పదవది. ఆదివారం జొకోవిచ్‌తో జరిగిన ఫైనల్లో వరుస సెట్లలో ఓటమిపాలైన గ్రీస్ ఆటగాడు స్టెఫనో సిట్సిపాస్ నార్వేకు చెందిన కాస్పర్ రూడ్‌ను వెనక్కి నెట్టి మూడో ర్యాంక్‌లో నిలిచాడు. కాస్పర్ రూడ్ నాలుగో స్థానంలో నిలవగా.. రష్యాకు చెందిన ఆండ్రే రుబ్లెవ్ ఐదో స్థానం సంపాదించాడు.