భువీ కంటే అతను మంచి బౌలర్.. జట్టులోకి తీసుకోండి: పాకిస్థాన్ మాజీ ప్లేయర్

by Disha Web |
భువీ కంటే అతను మంచి బౌలర్.. జట్టులోకి తీసుకోండి: పాకిస్థాన్ మాజీ ప్లేయర్
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా ఫాస్ట్ బౌలర్‌ భువనేశ్వర్‌పై పాకిస్తాన్ మాజీ ప్లేయర్ డానిష్ కనేరియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20 వరల్డ్‌కప్‌‌లోకి హాట్ ఫెవరట్‌గా భారీలోకి దిగిన టీమిండియా తీవ్ర నిరాశపరచడంతో.. జట్టులో మార్పులు చేయాలని సీనియర్, మాజీ ఆటగాళ్ల నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే డానిష్ కనేరియా స్పందిస్తూ.. టీ20 ఫార్మట్‌లో టీమిండియా బౌలర్ భువనేశ్వర్ స్థానంలో దీపక్ చాహర్ తీసుకోవాలని అన్నాడు. ఈ ప్లేయర్ భారత జట్టులో చాలా మంచి ఆటగాడని, తనను జట్టు బాగా ఉపయోగించుకోవాలని అభిప్రాయపడ్డాడు.

భువనేశ్వర్ కంటే దీపక్ చాహర్ మెరుగైన క్రికెటర్ అని తను భావిస్తున్నట్లు పేర్కొన్నాడు. నాలుగు ఓవర్లలో 35-40 పరుగులు ఇచ్చే బౌలర్ కావాలా? భువనేశ్వర్ కుమార్ జట్టు నుంచి వెళ్ళే సమయం వచ్చిందని వ్యాఖ్యనించాడు. అంతేకాకుండా ప్రసిద్ధ్ కృష్ణ, నటరాజన్ వంటి యువ ఆటగాళ్లు అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారని అన్నాడు. ఇప్పటికే అర్ష్‌దీప్ సింగ్ అవకాశం కల్పించగా.. అలాంటి యువ ఫేస్ బౌలర్లను టీమిండియా తీసుకోవాలని సూచించాడు. ఇకపోతే టీమిండియా, న్యూజిలాండ్ జట్ల జరిగిన టీ20 మ్యాచ్‌ల్లో సీరిస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా.. ఈ నెల 25న జరగబోయే వన్డే పోరుకు సిద్దమవుతోంది.Next Story