సౌతాఫ్రికా‌తో మ్యాచ్‌లకు టీమిండియా పేసర్ దూరం?

by Disha Web Desk 13 |
సౌతాఫ్రికా‌తో మ్యాచ్‌లకు టీమిండియా పేసర్ దూరం?
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా పేసర్ దీపక్ చహర్ సౌతాఫ్రికా పర్యటనలో కొన్ని మ్యాచ్‌లు దూరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తండ్రి అనారోగ్య కారణాల దృష్ట్యా అతడు సౌతాఫ్రికా సిరీస్‌కు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండకపోవచ్చనే సంకేతాలు వెలువడ్డాయి. అయితే గాయాల బెడదతో చాలా కాలం పాటు ఆటకు దూరమైన పేసర్‌ దీపక్‌ చహర్‌.. స్వదేశంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ సందర్భంగా పునరాగమనం చేశాడు. కంగారూ జట్టుతో నాలుగో మ్యాచ్‌కు యువ పేసర్‌ ముకేశ్‌ కుమార్‌ గైర్హాజరు కావడంతో అతడి స్థానంలో దీపక్‌ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. రాయ్‌పూర్‌ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసి టీమిండియా విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో ఐదో టీ20లో కూడా దీపక్‌ చహర్‌ ఆడతాడని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. వ్యక్తిగత కారణాల దృష్ట్యా అతడు ఆఖరి టీ20కి దూరమయ్యాడని తాత్కాలిక కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ వెల్లడించాడు.

తాజాగా ఈ విషయం గురించి దీపక్‌ చహర్‌ స్పందించాడు. తన తండ్రి లోకేంద్ర సింగ్‌ శనివారం(డిసెంబరు 2) బ్రెయిన్‌స్ట్రోక్‌కు గురయ్యారని.. అందుకే హుటాహుటిన అలీఘర్‌కు బయల్దేరినట్లు తెలిపాడు. ‘‘సరైన సమయానికి మా నాన్నను ఆస్పత్రికి తీసుకురాగలిగాం. లేదంటే పరిస్థితి విషమించేది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఆస్ట్రేలియాతో ఆఖరి టీ20లో ఎందుకు ఆడలేదని చాలా మంది నన్ను అడుగుతున్నారు. అన్నింటికంటే మా నాన్నే నాకు ముఖ్యం. ఈరోజు క్రికెటర్‌గా నేను ఇక్కడ ఉన్నానంటే అందుకు ఆయనే కారణం. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనను వదిలి నేను ఎక్కడికీ వెళ్లలేను. మా నాన్న అనారోగ్యం పాలైనప్పటి నుంచి ఆయనతోనే ఉన్నాను.Next Story

Most Viewed