లానింగ్ హాఫ్ సెంచరీ.. గుజరాత్ ముందు ఢిల్లీ పెట్టిన టార్గెట్ ఎంతంటే?

by Dishanational3 |
లానింగ్ హాఫ్ సెంచరీ.. గుజరాత్ ముందు ఢిల్లీ పెట్టిన టార్గెట్ ఎంతంటే?
X

దిశ, స్పోర్ట్స్ : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ సీజన్‌-2లో ఆదివారం బెంగళూరు వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్ జట్లు తలపడుతున్న విషయం తెలిసిందే. హ్యాట్రిక్ విజయంపై ఢిల్లీ కన్నేయగా.. టోర్నీలో ఇప్పటి వరకు ఖాతా తెరవని గుజరాత్ విజయం సాధించాలని పట్టుదలతో బరిలోకి దిగింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ జట్టు గుజరాత్ ముందు 164 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. నిర్ణీత ఓవర్లలో ఢిల్లీ 8 వికెట్లను కోల్పోయి 163 పరుగులు చేసింది. కెప్టెన్, ఓపెనర్ మెగ్ లానింగ్(55) హాఫ్ సెంచరీతో సత్తాచాటింది. అలీస్ క్యాప్సే(27), సదర్లాండ్(20) విలువైన పరుగులు జోడించారు. 105/3తో ఒక దశలో ఢిల్లీ భారీ స్కోరు సాధించేలా కనిపించగా.. గుజరాత్ బౌలర్లు కట్టడి చేశారు. మేఘ్న సింగ్ 4 వికెట్లతో సత్తాచాటింది. గార్డ్‌నెర్ 2 వికెట్లు తీయగా.. మన్నత్ కశ్యప్‌కు ఒక్క వికెట్ దక్కింది.


Next Story

Most Viewed