Wpl Final : చెలరేగిన బెంగళూరు బౌలర్లు.. స్వల్ప స్కోరుకే ఢిల్లీ ఆలౌట్

by Harish |
Wpl Final : చెలరేగిన బెంగళూరు బౌలర్లు.. స్వల్ప స్కోరుకే ఢిల్లీ ఆలౌట్
X

దిశ, స్పోర్ట్స్ : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఫైనల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు చెలరేగారు. ఆర్సీబీ బౌలర్ల ధాటికి ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు క్రీజులో నిలువలేకపోయారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ జట్టు 18.3 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌటైంది. షెఫాలీ వర్మ చేసిన 44 పరుగులకే టాప్ స్కోర్. లానింగ్ (23) స్వల్ప స్కోరుకే వెనుదిరగగా..రోడ్రిగ్స్(0), ఎలీస్ క్యాప్సే(0) దారుణంగా నిరాశపర్చడం ఢిల్లీని కోలుకోని దెబ్బ తీసింది. మారిజన్నె కాప్(9), జొనాస్సెన్(3) కూడా విఫలమయ్యారు. ఢిల్లీ బ్యాటింగ్ లైనప్‌లో ఆరుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. దీంతో ఢిల్లీ జట్టు బెంగళూరు ముందు 114 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. బెంగళూరు బౌలర్లలో శ్రేయాంక పాటిల్ 4 వికెట్లతో ఢిల్లీ పతనాన్ని శాసించింది. ఆమెకుతోడు మోలినెక్స్ 3 వికెట్లు, ఆశా శోభన 2 వికెట్లతో సత్తాచాటారు.

Next Story