Ambati Rayudu: రాయుడు రిటైర్మెంట్‌పై సీఎస్‌కే సీఈఓ క్లారిటీ.. అందుకే అలా చేశాడంటూ..

by Javid Pasha |   ( Updated:2022-05-14 12:06:24.0  )
Ambati Rayudu: రాయుడు రిటైర్మెంట్‌పై సీఎస్‌కే సీఈఓ క్లారిటీ.. అందుకే అలా చేశాడంటూ..
X

CSK CEO Gives Clarity On Ambati Rayudu Retirement Tweet

దిశ, వెబ్‌డెస్క్: చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మన్ అంబటి రాయుడు(Ambati Rayudu) ఈరోజు ఉదయం క్రికెట్ అభిమానులందరికీ షాక్ ఇచ్చాడు. తాను క్రికెట్ నుంచి తప్పకుంటున్నానని, ఐపీఎల్(IPL) 2022 టోర్న్‌మెంట్ తన చివరదంటూ ట్వీట్ చేశాడు. మళ్లీ కొద్దసేపటికే తన ట్వీట్ డిలీట్ చేసి అభిమానులను సందిగ్దంలో పడేశాడు. ఇంతకీ రాయుడు క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నాడా లేదా అన్నది తెలియక సీఎస్‌కే(CSK) అభిమానులు జుట్టుపీక్కుంటున్నారు. అయితే తాజాగా దీనిపై సీఎస్‌కే జట్టు సీఈఓ(CEO) కాశీవిశ్వనాథ్ నోరువిప్పారు. రాయుడు రిటైర్మెంట్‌పై ఆయన క్లారిటీ ఇచ్చారు.

'రాయుడు తన ప్రదర్శనలో మనస్తాపానికి గురయ్యాడు. ఆ బాధలోనే అతడు ఆ ట్వీట్ చేశాడు. మేము అతనితో మాట్లాడాము. అతడు రిటైర్ అవ్వడం లేదు. ఈ ట్వీట్ అనేది కేవలం మానసిక సంబంధిత విషయం. ఆ నిముషంలో అతడు ఎదుర్కొన్న బాధ, ఒత్తిడితో అతడు అలా చేశాడని నేను భావిస్తున్నాను' అని విశ్వనాథ్ చెప్పారు. దీంతో సీఎస్‌కే, క్రికెట్ అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఫామ్ వస్తుంది పోతుంది, ఒక్క టోర్నీలో ఆడలేకపోతే జీవితం అయిపోయినట్లు కాదు. ఇలాంటి ఫెల్యూర్స్ నువ్వు ఎన్నో చూసి ఉంటావ్.. దీనికే ఇలా బాధ పడితే ఎలా అంటూ నెటిజన్స్ తమ కామెంట్ల ద్వారా రాయుడికి ధైర్యం చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed