ఛత్తీస్‌గఢ్‌ రంజీ కెప్టెన్‌పై చీటింగ్ కేసు

by Vinod kumar |   ( Updated:2022-05-12 17:09:57.0  )
ఛత్తీస్‌గఢ్‌ రంజీ కెప్టెన్‌పై చీటింగ్ కేసు
X

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్‌లోని రంజీ ట్రోఫీ జట్టు కెప్టెన్‌పై బోగస్ పత్రాలు సమర్పించి ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఆడిట్ కార్యాలయంలో ఉద్యోగం పొందారనే ఆరోపణలపై నేరం నమోదు చేసినట్లు పోలీసులు గురువారం తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లోని ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ (ఆడిట్) కార్యాలయంలో బోగస్ పత్రాలను సమర్పించి.. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించినందుకు ఛత్తీస్‌గఢ్ రంజీ ట్రోఫీ జట్టు కెప్టెన్ హర్‌ ప్రీత్ సింగ్ భాటియాపై మోసం, ఫోర్జరీ కేసు నమోదైంది. హర్‌ప్రీత్ బుందేల్‌ఖండ్ యూనివర్శిటీ నుండి బికామ్ డిగ్రీ సర్టిఫికేట్‌ను సమర్పించారు. అయితే అటువంటి మార్క్‌షీట్ జారీ చేయలేదని అధికారులు గుర్తించారు. భాటియా 2010 ICC అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్‌లో భారత జట్టులో సభ్యుడుగా ఉన్నాడు. 2011 ఐపీఎల్‌లో పూణే వారియర్స్ జట్టులో ఎంపికయ్యాడు.

Advertisement

Next Story

Most Viewed