- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సెమీస్‌కు చేరిన భారత గ్రాండ్‌మాస్టర్..
చెన్నయ్: భారత చెస్ యువ సంచలనం, గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద రమేశ్‌బాబు చెస్సబుల్ మాస్టర్స్ రాపిడ్ చెస్ టోర్నమెంట్‌లో మరో ముందడుగు వేశాడు. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో చైనా గ్రాండ్‌మాస్టర్ వెయ్ యూను చిత్తు చేసి సెమీ ఫైనల్స్‌లోకి ప్రవేశించాడు. నాలుగు గేమ్‌ల ఆటలో ప్రజ్ఞా శుభారంభం చేశాడు. తొలి రెండు గేమ్‌లను గెలుచుకుని 2-0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత చైనా గ్రాండ్‌మాస్టర్ పుంజుకుని మూడో గేమ్‌ను దక్కించుకున్నాడు.
ఇక, నాలుగో గేమ్ డ్రాగా ముగియడంతో 2.5-1.5తో ప్రజ్ఞానంద విజయం సాధించి సెమీస్ బెర్త్ ఖాయం చేసుకున్నాడు. ఈ విజయంతో రెండో స్థానానికి ఎగబాకిన అతను.. సెమీస్‌లో నెదర్లాండ్స్‌కు చెందిన అనిష్ గిరితో ఆడనున్నాడు. కాగా, 5వ రౌండ్‌లో వరల్డ్ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్‌పై ప్రజ్ఞానంద పైచేయి సాధించిన విషయం తెలిసిందే. మూడు నెలల వ్యవధిలో కార్ల్‌సన్‌పై ప్రజ్ఞానందకు ఇది రెండో గెలుపు. అలాగే, భారత గ్రాండ్‌మాస్టర్లు హరికృష్ణ, విదిత్ గుజరాతి నాకౌట్ దశకు చేరుకోలేకపోయారు.