Team India: వరల్డ్ కప్ ముగిసింది.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఏంటి..?

by Disha Web Desk 13 |
Team India: వరల్డ్ కప్ ముగిసింది.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఏంటి..?
X

దిశ, వెబ్‌డెస్క్: స్వదేశంలో ముగిసిన వన్డే ప్రపంచకప్‌లో కప్పు సాధించాలనే పట్టుదలతో బరిలోకి దిగిన టీమిండియా ఆఖరి మ్యాచ్‌లో బొక్కబోర్లా పడింది. ఈ మెగా టోర్నీ తర్వాత ఏం చేయనుంది..? టీమిండియా తర్వాతి షెడ్యూల్ ఎలా ఉంది..? మరో నాలుగు నెలల్లో ఐపీఎల్‌ తర్వాతి సీజన్‌ మొదలుకానున్న నేపథ్యంలో టీమిండియా షెడ్యూల్‌ ఎలా ఉండనుందో ఇక్కడ చూద్దాం. ఈనెల 23 నుంచి డిసెంబర్‌ 03 వరకూ ఇండియా-ఆసీస్‌ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ జరుగనుంది.

ఆ తర్వాత భారత్‌.. డిసెంబర్‌లో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. సుమారు నెల రోజుల పాటు జరుగబోయే ఈ టూర్‌లో భారత్‌.. మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. అనంతరం అఫ్గానిస్తాన్‌.. భారత పర్యటనలో మూడు టీ20లు ఆడాల్సి ఉంది. జనవరి – మార్చి దాకా భారత్‌ – ఇంగ్లండ్‌ మధ్య ఐదు టెస్టుల సిరీస్‌ జరగాల్సి ఉంది. ఈ సిరీస్‌ ముగిసిన తర్వాత మార్చి మాసాంతం నుంచి ఐపీఎల్‌ మొదలవుతుంది. ఐపీఎల్‌ ముగిసిన వెంటనే జూన్‌లో వెస్టిండీస్, అమెరికా వేదికగా టీ20 వరల్డ్‌ కప్‌ జరుగనుంది.

టీమిండియా షెడ్యూల్:

నవంబర్‌ 23 నుంచి డిసెంబర్‌ 08 వరకూ ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌

డిసెంబర్‌ 10 నుంచి 2024 జనవరి 07 దాకా భారత్‌.. సౌతాఫ్రికా టూర్‌కు వెళ్లనుంది.

జనవరి 11 నుంచి 17 వరకూ అఫ్గానిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌

జనవరి 25 నుంచి మార్చి 11 దాకా ఇండియా – ఇంగ్లండ్‌ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌

మార్చి – ఏప్రిల్‌ – మే లలో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌

2024 జూన్‌లో టీ20 వరల్డ్‌ కప్‌

Next Story

Most Viewed