వరల్డ్ కప్ నుంచి బుమ్రా ఔట్.. ప్రకటించిన బీసీసీఐ..

by Disha Web |
వరల్డ్ కప్ నుంచి బుమ్రా ఔట్.. ప్రకటించిన బీసీసీఐ..
X

దిశ, వెబ్‌డెస్క్: అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీ20 వరల్డ్ కప్ అక్టోబర్ 16 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో ఇండియా, ఆస్ట్రేలియాలు ఫేవరేట్‌లుగా ఉన్నాయి. అయితే భారత జట్టు ప్లేయర్ల విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ఈ టోర్నీలో టీమిండియాకు ట్రంప్ కార్డ్ బుమ్రా దూరం కానున్నాడని, వెన్నెముక గాయం కారణంగా బుమ్రా ఈ టోర్నీలో ఆడే అవకాశం లేదని వార్తలు నెట్టింట తెగ హల్‌చల్ సృష్టించాయి. అయితే బుమ్రా ఇంకా టీం నుంచి తొలగించబడలేదని, ప్రస్తుతం బుమ్రా బెంగళూరులోని ఎన్‌సీఏలో ట్రైన్ అవుతున్నాడని టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ తెలిపారు.

అయితే తాజాగా బుమ్రా టీ20 వరల్డ్ కప్ నుంచి తొలగించబడ్డాడని, ఇండియా 11లో బుమ్రాను వేరే ప్లేయర్ రీప్లేస్ చేస్తాడని బీసీసీఐ అధికారికంగా వెల్లడించింది. 'ఈ నిర్ణయం పూర్తిస్థాయి అంచనా, నిపుణులను సంప్రదించిన తర్వాత తీసుకోబడింది' అని బీసీసీఐ తన తాజా స్టేట్‌మెంట్‌లో పేర్కొంది. అంతేకాకుండా వరల్డ్ కప్ బరిలో బుమ్రా స్థానంలో ఎవరు ఆడనున్నారన్న విషయాన్ని బీసీసీఐ త్వరలో తెలపనుంది.

Next Story

Most Viewed