మహిళల టేబుల్ టెన్నిస్ జట్టుకు కాంస్యం

by Shamantha N |
మహిళల టేబుల్ టెన్నిస్ జట్టుకు కాంస్యం
X

దిశ, స్పోర్ట్స్ : రష్యాలో జరుగుతున్న బ్రిక్స్ గేమ్స్‌లో భారత మహిళల టేబుల్ టెన్నిస్ జట్టు కాంస్య పతకం సాధించింది. శనివారం జరిగిన సెమీస్‌లో పోయిమంటి బైస్యా, మౌమిత దత్తా, యాషిని శివశంకర్‌లతో కూడిన భారత జట్టు 1-3 తేడాతో చైనా టీమ్ చేతిలో ఓడిపోయి మూడో స్థానంతో సరిపెట్టింది. మొదట ఈ మ్యాచ్‌లో యాషిని తొలి గేమ్‌ను నెగ్గి భారత్‌కు శుభారంభం అందించింది. ఆ తర్వాత భారత్ అదే జోరు కొనసాగించలేకపోయింది. చైనా వరుసగా మూడు గేమ్‌ల్లో విజయం సాధించి మ్యాచ్‌ను సొంతం చేసుకోవడంతో భారత్ కాంస్యం సరిపెట్టింది. ఈ టోర్నీలో భారత్‌కు ఇదే తొలి మెడల్. అలాగే, ఈ టోర్నీ చరిత్రలో మహిళల టెన్నిస్ జట్టు తొలి పతకం సాధించింది. మరోవైపు, ఈ టోర్నీలో భారత పురుషుల టేబుల్ టెన్నిస్ జట్టు 5వ స్థానంలో నిలిచింది. 5వ స్థానం కోసం జరిగిన ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లో భారత్ 3-1 తేడాతో బహ్రెయిన్ టీమ్‌ను చిత్తు చేసింది.Next Story

Most Viewed