2022 FIFA: దక్షిణ కొరియాపై విజయం.. క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్న బ్రెజిల్

by Dishanational4 |
2022 FIFA: దక్షిణ కొరియాపై విజయం.. క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్న బ్రెజిల్
X

దిశ, వెబ్‌డెస్క్: ఫిఫా వరల్డ్‌కప్‌లో టైటిల్ పేవరేట్‌గా బరిలోకి దిగిన బ్రెజిల్ జట్టు విజయాలతో దూసుకుపోతోంది. దక్షిణ కొరియాతో జరిగిన మ్యాచ్‌లో బ్రెజిల్ ఘన విజయం సాధించింది. రౌండ్ ఆఫ్ 16లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో దక్షిణ కొరియాపై బ్రెజిల్ 4-1 తేడా విజయంతో క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో బ్రెజిల్ తరుపున వినిసియస్ జూనియర్, నెయమర్, రిచర్లిసన్, లుకాస్ గోల్స్ చేశారు. ఇక విజయంతో ఎనిమిదోసారి ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్న జట్టుగా బ్రెజిల్ ఘనత సాధించింది. క్వార్టర్ ఫైనల్‌లో బ్రెజిల్, క్రొయేషియా మధ్య డిసెంబర్ 9న మ్యాచ్ జరుగనుంది.



Next Story

Most Viewed