ఆర్సీబీలోకి డేంజరస్ ఆల్ రౌండర్ ఎంట్రీ.. అఫీషియల్‌గా ప్రకటించిన బెంగళూరు

by Disha Web Desk 19 |
ఆర్సీబీలోకి డేంజరస్ ఆల్ రౌండర్ ఎంట్రీ.. అఫీషియల్‌గా ప్రకటించిన బెంగళూరు
X

బెంగళూరు: గాయం కారణంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు క్రికెటర్ విల్ జాక్స్ ఐపీఎల్‌-16కు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో అతని స్థానాన్ని న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ మైఖేల్ బ్రేస్‌వెల్ భర్తీ చేయనున్నాడు. ఈ విషయాన్ని ఆర్‌సీబీ శనివారం ట్విట్టర్ వేదికగా తెలిపింది. ఇంగ్లాండ్‌కు చెందిన విల్ జాక్స్‌ను వేలంలో బెంగళూరు ఫ్రాంచైజీ రూ. 3.20 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, ఇటీవల బంగ్లాదేశ్ పర్యటనలో అతను గాయపడటంతో లీగ్‌కు అందుబాటులో ఉండటం లేదు.

దాంతో అతని స్థానంలో ఇటీవల భారత పర్యటనలో సత్తాచాటిన బ్రేస్‌వెల్‌ను జట్టులోకి తీసుకుంది. బ్రేస్‌వెల్ 16 టీ20ల్లో 113 పరుగులు చేయడంతోపాటు 5.36 ఎకానమీతో 21 వికెట్ల తీశాడు. ఈ నెలలో శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్‌కు బ్రేస్‌వెల్‌ ఎంపికయ్యాడు. అయితే, అతను ఆర్‌సీబీ జట్టులో చేరడంతో న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు అతని స్థానంలో ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్రను జట్టులోకి తీసుకుంది. కాగా, ఐపీఎల్‌లో ఏప్రిల్ 2న జరిగే మ్యాచ్‌లో బెంగళూరు జట్టు ముంబై ఇండియన్స్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది.


Next Story

Most Viewed