ముంబై ఇండియన్స్ జట్టు గురించి ఆ టీం ప్లేయర్ ఏమన్నాడంటే?

by Dishanational6 |
ముంబై ఇండియన్స్ జట్టు గురించి ఆ టీం ప్లేయర్ ఏమన్నాడంటే?
X

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ ప్రదర్శన పేలవంగా ఉంది. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆరు వికెట్ల తేడాతో ఘోర పరాభవం చవిచూసింది. కాగా.. మ్యాచ్ ఓడిపోయాక ముంబై జట్టు పరిస్థితి గురించి స్టార్ ప్లేయర్ ఆకాశ్ మద్వల్ మీడియాతో మాట్లాడాడు. ముంబై జట్టు వాతావరణ అధ్బుతంగా ఉందని అన్నాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఇద్దరూ జట్టుకు మద్దతుగా ఉన్నారని అన్నాడు. ప్రాక్టీస్ మ్యాచ్ లో హార్దిక్, రోహిత్ తో మ్టాడానని.. బుమ్రా భాయ్ కూడా ఉన్నాడని పేర్కొన్నాడు. రాబోయే గేమ్ లో మెరుగ్గా రాణించాలని వారు అన్నట్లు తెలిపాడు.

ఇకపోతే, మొదటి రెండు గేమ్‌లకు జట్టులోకి తీసుకోకపోవడంపై అడిగిన ప్రశ్నకు జవాబిచ్చాడు ఆకాశ్ మద్వల్. వ్యక్తిగత ప్రయోజనం కంటే జట్టు కోసం ఆడతానని అన్నాడు. తొలి రెండు మ్యాచ్ ల్లో జట్టు కూర్పు బాగుందని అన్నాడు. ప్రపంచస్థాయి బౌలర్లు జట్టులో స్థానం కోసం నిరంతరం పోటీ పడతారని గుర్తుచేశాడు.

ఆకాశ్ మద్వల్ గత సీజన్‌లో ఐపీఎల్ అరంగేట్రం చేశాడు.గత సీజన్ లో ఎలిమినేటర్ మ్యాచ్లో లక్నో జట్టుపై 5 వికెట్ల తేడాతో విరుచుకుపడ్డు. 8 మ్యాచ్ లు ఆడిన మద్వల్ 14 వికెట్లు పడగొట్టాడు. కాగా..ఈ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ ఆడిన మూడు మ్యాచుల్లో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ముంబై ఇండియన్స్ ఆడిన మూడు మ్యాచ్ ల్లో ఓడి అట్టడుగు స్థానంలో నిలిచింది.


Next Story

Most Viewed