ఫిఫా వరల్డ్ కప్‌: బ్రెజిల్ రికార్డు సమం చేసి.. కెనడాపై బెల్జియం ఉత్కంఠ విజయం

by Disha Web |
ఫిఫా వరల్డ్ కప్‌: బ్రెజిల్ రికార్డు సమం చేసి.. కెనడాపై బెల్జియం ఉత్కంఠ విజయం
X

దిశ, వెబ్‌డెస్క్: ఫిఫా వరల్డ్ కప్‌ 2022లో భాగంగా కెనడా, బెల్జియం మధ్య జరిగిన మ్యాచ్‌లో కెనడాపై బెల్జియం విజేతగా నిలిచింది. ఆట ఆరంభమైన నుంచి కెనడా జట్టుకు ఎన్నో అవకాశాలను వచ్చిన కానీ వాటిని గోల్స్‌గా మలచలేకపోయింది. అదే సమయంలో బెల్జియం ప్లేయర్ మిచీ బాట్సుషాయి తనకు వచ్చిన అవకాశాన్ని గోల్‌గా మలిచాడు. దీంతో తొలి అర్థభాగం బెల్జియం 1-0తో ఆధిక్యంలో నిలిచింది. అంతకుముందు బెల్జియం ఆటగాడు యానిక్ కారస్కో.. బాక్స్‌లో చేసిన తప్పిదం వల్ల ఎల్లో కార్డ్ చూపించడంతోపాటు కెనడాకు పెనాల్టీ కిక్ లభించింది. అయితే బెల్జియం గోల్ కీపర్ థిబాట్ కర్టాయిస్ గోల్ అడ్డుకున్నాడు. ఈ ఉత్కంఠభరిత విజయంతో బెల్జియం జట్టు మరో రికార్డు సృష్టించింది. ఫిపా వరల్డ్ కప్ గ్రూప్ దశలో వరుసగా 8 విజయాలు సాధించిన జట్టుగా బ్రెజిల్ పేరిట ఉన్న రికార్డును సమం చేసింది.

Next Story

Most Viewed