- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
బీసీసీఐలో హెడ్ ఫిజియోథెరపిస్ట్, స్ట్రెంత్ కండిషనింగ్ కోచ్‌ల కోసం దరఖాస్తులకు ఆహ్వానం

దిశ, వెబ్ డెస్క్: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) టీం ఇండియా (సీనియర్ ఉమెన్)లో రెండు కీలక పదవులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతం సీనియర్ ఉమెన్స్ జట్టులో హెడ్ ఫిజియోథెరపిస్ట్ (Head Physiotherapist), స్ట్రెంత్ & కండిషనింగ్ కోచ్ (Strength & Conditioning Coach) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రెండు ఖాళీలు బెంగళూరులోని అత్యాధునిక BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE)లో ఉంటాయి. ఈ జాబ్ కోసం సెలెక్ట్ అయిన వారు. మ్యాచ్‌లు, టోర్నమెంట్‌ల కోసం టీం ఇండియా (సీనియర్ ఉమెన్)తో ప్రయాణించాల్సి ఉంటుంది. ఇవి స్పోర్ట్స్ సైన్స్ & మెడిసిన్ (SSM) జట్టుకు అంతర్భాగంగా ఉంటాయి. క్రీడాకారుల పనితీరును మెరుగుపరచడానికి, ప్రభావవంతమైన గాయం నిర్వహణ, నివారణ ప్రోటోకాల్‌లను అమలు చేయడానికి అధిక-పనితీరు మద్దతు సేవలను అందిస్తాయి.
అర్హత సాధించిన అభ్యర్థులు బహుళ విభాగ వాతావరణంలో పని చేస్తారు. ఈ రెండు పోస్టులు భారత మహిళా క్రికెట్ మొత్తం అభివృద్ధికి దోహదం చేస్తాయి. కాగా పొజిషన్‌లకు అప్లై చేసుకునే వారికి.. స్పోర్ట్స్, మస్క్యులోస్కెలెటల్ ఫిజియోథెరపీ/స్పోర్ట్స్ & ఎక్సర్సైజ్ మెడిసిన్/స్పోర్ట్స్ రిహాబిలిటేషన్‌లో ప్రత్యేకత కలిగిన పోస్ట్ గ్రాడ్యుయేట్ అర్హత ఫిజియోథెరపీ సేవలలో కనీసం 10 సంవత్సరాల అనుభవం ఉండాలి. అలాగే మరో పోస్టుకు స్పోర్ట్స్ ఫిజియాలజీ/సైన్స్‌లో ప్రత్యేకత కలిగిన అర్హత ఉండాలని బీసీసీఐ ప్రకటించింది. అర్హత కలిగిన వారు ఈ నెల 30 వరకు దరఖాస్తు చేసుకోవాలని బీసీసీఐ ప్రకటనలో తెలిపింది.