2023-24 దేశవాళీ క్రికెట్ సీజన్ షెడ్యూల్‌ను రిలీజ్ చేసిన బీసీసీఐ

by Disha Web Desk 13 |
2023-24 దేశవాళీ క్రికెట్ సీజన్ షెడ్యూల్‌ను రిలీజ్ చేసిన బీసీసీఐ
X

న్యూఢిల్లీ: భారత దేశవాళీ సీజన్ 2023-24 షెడ్యూల్‌ను బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. కరోనా కారణంగా గత సీజన్లలో బోర్డు పూర్తి స్థాయిలో దేశవాళీ టోర్నీలను నిర్వహించలేకపోయింది. ఈ సారి పూర్తి స్థాయిలో దేశవాళీ టోర్నీని నిర్వహించనున్నట్టు బీసీసీఐ తెలిపింది. ఈ ఏడాది జూన్ చివరి వారంలో మొదలై వచ్చే ఏడాది మార్చి వరకు దేశవాళీ షెడ్యూల్‌ను బోర్డు వెల్లడించింది. ఈ సీజన్‌లో మొత్తం 1, 846 మ్యాచ్‌లు జరగనున్నాయి. జూన్ 28న ప్రారంభమయ్యే దులీప్ ట్రోఫీతో 2023-24 సీజన్‌ను మొదలువుతుంది.

కరోనా కారణంగా మూడేళ్లపాటు నిర్వహించిన ప్రొఫెసర్ దేవ్‌ధర్ ట్రోఫీని షెడ్యూల్‌లో చేర్చారు. జూలై 24 నుంచి ఆగస్టు 3 వరకు ఈ టోర్నీ జరగనుంది. ఆ వెంటనే అక్టోబర్‌లో ఇరానీ కప్, సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ(అక్టోబర్‌ 16 నుంచి నవంబర్‌ 6), విజయ్‌ హజారె ట్రోఫీ (నవంబర్‌ 23 నుంచి డిసెంబర్‌ 15) జరుగుతాయి.

అలాగే, ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ వచ్చే ఏడాది జనవరి 5 నుంచి మార్చి 14 వరకు జరుగుతుంది. పురుషుల అండర్-23, అండర్-19, అండర్-16 షెడ్యూల్‌ను కూడా విడుదలైంది. అలాగే, సీనియర్ మహిళల దేశవాళీ సీజన్ షెడ్యూల్‌ను కూడా బీసీసీఐ ప్రకటించింది. అక్టోబర్ 19 నుంచి నవంబర్ 9 మధ్య జరిగే సీనియర్ ఉమెన్స్ టీ20 ట్రోఫీతో సీజన్ మొదలుకానుంది. ఆ తర్వాత నవంబర్‌లో ఇంటర్ జోనల్ ట్రోఫీ నిర్వహించనున్నాడు. వచ్చే ఏడాది జనవరి 4న వన్డే ట్రోఫీ ప్రారంభంకానుండగా.. 26వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

Next Story

Most Viewed