బంగ్లాదేశ్ టూరుకు భారత మహిళల జట్టు..!

by Dishanational6 |
బంగ్లాదేశ్ టూరుకు భారత మహిళల జట్టు..!
X

దిశ, స్పోర్ట్స్: బంగ్లాదేశ్ టూరుకు సిద్ధమైంది భారత మహిళల జట్టు. ఐదు మ్యాచుల టీ20 సిరీస్ కోసం బంగ్లాదేశ్ వెళ్లనుంది. ఏప్రిల్ 28 నుంచి మే 9 వరకు భారత్- బంగ్లా మహిళల జట్టు మధ్య ఐదు టీ20ల సిరీస్ జరగనుంది. ఈనెల 23న భారత మహిళల జట్టు బంగ్లాదేశ్ వెళ్లనుంది. మే 10న తిరిగి స్వదేశానికి రానున్నారు భారత మహిళా ప్లేయర్లు. తొలిమ్యాచ్ ప్రిల్ 28న జరగనుండగా.. వరుసగా ఏప్రిల్ 30, మే 2, మే 6, మే9న మిగతా మ్యాచ్ లు జరగనున్నాయి. ఐదు మ్యాచ్ ల సిరీస్ లో మూడు డే- నైట్ మ్యాచ్ లు జరగనున్నాయి. తొలి రెండు మ్యాచ్ లు, చివరి మ్యాచ్ డే-నైట్ మ్యాచ్ లని అని బీసీసీఐ తెలిపింది. మరోవైపు అన్ని మ్యాచ్ లు బంగ్లాదేశ్ లోని సిల్హెట్ అంతర్జాతీయ స్టేడియంలో జరగనున్నాయి.


Next Story

Most Viewed