చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా ఓపెనర్

by Dishanational4 |
చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా ఓపెనర్
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియాతో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్ కెమరూన్ గ్రీన్ ఆకాశమే హద్దుగా చేలారేగాడు. 21 బంతుల్లో ..7 ఫోర్లు, 3 సిక్సర్లతో 52 పరుగులు చేసి.. టీమిండియా బౌలర్లను హడలేత్తించించాడు. ఆ హాఫ్‌సెంచరీతో కెమరూన్ గ్రీన్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీమిండియాపై వేగంగా హాఫ్ సెంచరీ చేసిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. అయితే ఈ రికార్డు ఇదివరకు వెస్టిండీస్ పేరిట ఉండేది. వెస్టిండీస్ ప్లేయర్ జాన్సన్ చార్లెస్ 2016లో టీమిండియాపై 20 బంతుల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ చేశాడు.19 బంతుల్లోనే హాఫ్‌సెంచరీ చేసిన గ్రీన్.. తాజాగా జాన్సన్ చార్లెస్ రికార్డు బ్రేక్ చేస్తూ.. ఈ జాబీతాలో తొలిప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు.



Next Story

Most Viewed