Asia Cup 2023 IND vs PAK: 'అతన్ని ఆడించకపోతే.. టీమిండియా పెద్ద తప్పు చేసినట్లే'

by Vinod kumar |
Asia Cup 2023 IND vs PAK: అతన్ని ఆడించకపోతే.. టీమిండియా పెద్ద తప్పు చేసినట్లే
X

దిశ, వెబ్‌డెస్క్: ఆసియా కప్‌లో అందరూ ఎదురు చూసిన భారత్, పాక్ మ్యాచ్ ఫలితం తేలకుండానే ఆగిపోయింది. అయితే సూపర్-4 దశలో ఈ రెండు టీమ్స్ మరోసారి తలపడేందుకు రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి పాక్‌తో తలపడితే టీమ్‌లోకి కేఎల్ రాహుల్‌ను తీసుకోవాలా? లేక ఇషాన్ కిషన్‌ను ఆడించాలా? అని డిబేట్ జరుగుతోంది. గ్రూప్ దశలో భారత టాపార్డర్ విఫలమైన వేళ కిషన్ అద్భుతంగా ఆడిన సంగతి తెలిసిందే. గ్రూప్ దశలో భారత్, పాక్ ఆడిన మ్యాచ్‌లో టీమిండియా టాపార్డర్ బాగా దెబ్బతిన్నది. అలాంటి సమయంలో ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా కలిసి జట్టును గట్టెక్కించారు. ఈ క్రమంలో మరోసారి పాక్‌తో జరిగే మ్యాచ్‌లో కిషన్‌ను ఆడించాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో కనుక కిషన్‌ను కాదని రాహుల్‌ను తీసుకుంటే అది చాలా పెద్ద తప్పని మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ కామెంట్స్ చేశారు. రాహుల్‌ కన్నా ముందు కిషన్‌ను కనుక ఆడించకపోతే.. టీమిండియా అతి పెద్ద పొరపాటు చేసినట్లే' అని గంభీర్ అభిప్రాయపడ్డాడు. మరో మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా కూడా దీనికి అంగీకరించాడు. జట్టులో స్థానం సుస్థిరం కాకపోయినా కూడా.. అవకాశం వచ్చిన ప్రతిసారీ కిషన్ రాణించాడని చోప్రా మెచ్చుకున్నాడు. ఒత్తిడిలో పరుగులు చేయడం కష్టమని, కానీ కిషన్ ఒత్తిడిలో కూడా ఆకట్టుకున్నాడని చెప్పాడు. 'కిషన్‌కు ఎక్కువ అవకాశాలు రాలేదని తెలిపారు.



Next Story

Most Viewed