కొన్ని నెలల్లోనే.. రిటైర్మెంట్‌పై ఆండీ ముర్రే ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Dishanational3 |
కొన్ని నెలల్లోనే.. రిటైర్మెంట్‌పై ఆండీ ముర్రే ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్ స్టార్ టెన్నిస్ ప్లేయర్, మాజీ వరల్డ్ నం.1 ఆండ్రీ ముర్రే రిటైర్మెంట్‌పై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. కొన్ని నెలల్లోనే ఆటకు వీడ్కో్లు పలకనున్నట్టు తెలిపాడు. గతంలో కూడా ఏటీపీ టూరులో 2024 సంవత్సరం తనకు చివరిది కావచ్చని వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం దుబాయ్ టెన్నిస్ చాంపియన్‌షిప్ ఆడుతున్న ముర్రే టోర్నీలో శుభారంభం చేశాడు. సోమవారం అర్ధరాత్రి జరిగిన తొలి రౌండ్‌లో ముర్రే 4-6, 7-6(7-5), 6-4 తేడాతో కెనడా ఆటగాడు డెనిస్ షాపోవలోవ్‌పై విజయం సాధించాడు. రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలి సెట్ కోల్పోయిన ముర్రే.. చివరి రెండు సెట్లను గెలుచుకుని రెండో రౌండ్‌కు అర్హత సాధించాడు. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన ముర్రే.. తాను ఎక్కువ కాలం ఆడకపోవచ్చని, అయితే, చివరి నెలల్లో తాను ఉత్తమ ప్రదర్శన ఇస్తానని చెప్పాడు. ‘నేను ఇప్పటికీ ఆడాలనుకుంటున్నా. ఆటను ప్రేమిస్తున్నా. అయితే, వయసు పెరుగుతున్నా కొద్దీ యువకులతో ఆడటం, అందుకు తమ శరీరాన్ని ఫిట్‌‌గా, తాజాగా ఉంచుకోవడం చాలా కష్టం.’ అని వ్యాఖ్యానించాడు. షాపోవలోవ్‌‌పై గెలుపుతో హార్డ్ కోర్టులో ముర్రే 500వ విజయాన్ని నమోదు చేశాడు. దీంతో రోగర్ ఫెదరర్, నోవాక్ జకోవిచ్, రాఫెల్ నదాల్, ఆండ్రీ అగస్సీ సరసన నిలిచాడు. గతంలో కూడా 2024 తనకు చివరి సంవత్సరం అని చెప్పాడు.


Next Story