అమెరికా బాడీబిల్డర్‌కు మిస్టర్ ఒలింపియా 2023 టైటిల్..

by Vinod kumar |
అమెరికా బాడీబిల్డర్‌కు మిస్టర్ ఒలింపియా 2023 టైటిల్..
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా బాడీబిల్డర్ డీరెక్ లున్స్‌ఫోర్డ్‌ మిస్టర్ ఒలింపియా 2023 టైటిల్ విజేత‌గా నిలిచాడు. శ‌నివారం ఫ్లొరిడాలోని ఆరెంజ్ కౌంటీ క‌న్వెన్షన్ సెంట‌ర్‌లో జ‌రిగిన దేహ ధారుడ్య పోటీల్లో అగ్రస్థానంలో నిలిచిన‌ డీరెక్.. టైటిల్‌తో పాటు 4 ల‌క్షల అమెరిక‌న్ డాల‌ర్లు (భార‌తీయ క‌రెన్సీలో రూ. 3.3 కోట్లు) ప్రైజ్‌మ‌నీ గెలుచుకున్నాడు. అంతేకాదు ‘పీపుల్స్ ఒలింపియా చాంప్ 2023’ గౌర‌వం కూడా పొందాడు. ఫైన‌ల్లో అత‌డికి 2022లో చాంపియ‌న్‌గా అవ‌త‌రించిన‌ హ‌డి చూప‌న్ నుంచి గ‌ట్టి పోటీ ఎదురైంది. శాంస‌న్ దౌడ బ్రాండ‌న్ కర్రీలు వ‌రుస‌గా మూడు, నాలుగు స్థానాలు ద‌క్కించుకున్నారు. ఫేవ‌రేట్‌గా బ‌రిలోకి దిగిన టొనియో బ‌ర్టన్స్ 8వ ప్లేస్‌లో నిలిచాడు. రేగాన్ గ్రిమ్స్‌, చార్లెస్ గ్రిఫెన్‌లు 9వ‌, 10వ స్థానంతో స‌రిపెట్టుకున్నారు.

Next Story

Most Viewed