జపాన్ ఓపెన్ నుంచి సింధు, సాత్విక్ జోడీ విత్‌డ్రా

by Harish |
జపాన్ ఓపెన్ నుంచి సింధు, సాత్విక్ జోడీ విత్‌డ్రా
X

దిశ, స్పోర్ట్స్ : పారిస్ ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ క్రీడలో భారత్‌కు ఒక్క పతకం కూడా దక్కలేదు. పీవీ సింధు, ప్రణయ్, సాత్విక్‌-చిరాగ్ జోడీ అంచనాలను అందుకోవడంలో విఫలమవ్వగా.. లక్ష్యసేన్ బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌లో ఓడిపోయాడు. ఒలింపిక్స్‌లో వైఫల్యం తర్వాత భారత స్టార్ షట్లర్లు ఈ నెలలో జరగబోయే జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. పీవీ సింధు, లక్ష్యసేన్, హెచ్ ప్రణయ్‌లతోపాటు పురుషుల డబుల్స్ జంట సాత్విక్-చిరాగ్ జోడీ ఈ టోర్నీ నుంచి విత్ డ్రా అయ్యారు. వారితోపాటు భారత్ నుంచి ప్రియాన్ష్ రజావత్, సమీర్ వర్మ, సాయిప్రతీక్-కృష్ణ ప్రసాద్, ట్రీసా జాలీ/గాయత్రి గోపిచంద్‌ టోర్నీ నుంచి వైదొలిగిన జాబితాలో ఉన్నారు. ఇతర అంతర్జాతీయ స్టార్ ప్లేయర్లు కూడా టోర్నీ నుంచి వైదొలిగినట్టు బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్(బీడబ్ల్యూఎఫ్) తెలిపింది. ఈ నెల 20 నుంచి జపాన్ ఓపెన్ టోర్నీ మొదలుకానుంది.

Advertisement

Next Story