టీ20 క్రికెట్‌ చరిత్రలోనే సంచలనం

by Disha Web Desk 12 |
టీ20 క్రికెట్‌ చరిత్రలోనే సంచలనం
X

దిశ, వెబ్ డెస్క్: క్రికెట్ చరిత్రలో టీ20 ఫార్మట్ కు అత్యధిక ఆదరణ ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే ప్లేయర్లు మెరుపు ఇన్నింగ్స్ ఆడుతుంటారు. ఈ ఫార్మట్‌లో మహళా జట్లు కూడా తమదైన శైలిలో రెచ్చిపోయి ఆడుతుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ 17 ఏళ్ల యువతి ప్రపంచ క్రికెట్ చరిత్రలో సంచలన రికార్డు నమోదు చేసింది. ఇండోనేషియా, మంగోలియా మహిళల జట్ల మధ్య టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఇండోనేసియా బౌలర్ రోహ్మాలియా.. 3.2 ఓవర్లు బౌలింగ్ వేసి ఒక్క రన్ కూడా ఇవ్వకుండా ఏకంగా 7 వికెట్లు తీసింది. దీంతో మంగోలియా జట్టు 24 పరుగులకే ఆలౌట్ కాగా.. ఈ మ్యాచ్ లో ఇండోనేషియా 127 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా టీ20లో ఓ ప్లేయర్ సింగల్ పరుగు కూడా ఇవ్వకుండా.. ఏకంగా 7 వికెట్లు తీయడం ఇదే మొదటిసారి



Next Story

Most Viewed