- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
2 కాంస్య పతకాలు సాధించడంతో ఒక కల నిజమైంది: మను భాకర్
దిశ, వెబ్‌డెస్క్: 2024 పారిస్ ఒలింపిక్స్‌లో ఎయిల్ పిస్తల్ షూటర్ మను భాకర్ రెండు కాంస్య పతకాలు సాధించారు. దీంతో ఒలింపిక్స్ లో రెండు పతకాలు సాధించిన ఏకైక మహిళా ప్లేయర్ గా ఆమె నిలిచారు. అయితే ఈ రోజు మరో ఈవెంట్ లో పోటీ చేసిన ఆమె ఓటమి పాలయ్యారు. అనంతరం రెండు కాంస్య పతకాలు సాధించిన ఆమె ట్విట్టర్ ద్వారా స్పందించారు. తన ట్వీట్‌లో.."తనకు వస్తున్న ఒలింపిక్స్‌లో 2 కాంస్య పతకాలు సాధించడంతో ఒక కల నిజమైంది. ఈ ఘనత కేవలం నాది మాత్రమే కాదు. నన్ను నమ్మి నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ చెందుతుంది. NRAI, TOPS, SAI, OGQ, Performax తో సహా నా కుటుంబం, కోచ్ జస్పాల్ రాణా సర్ నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరి తిరుగులేని మద్దతు లేకుండా నేను దీన్ని చేయలేను. ముఖ్యంగా హర్యానా ప్రభుత్వం. నా శ్రేయోభిలాషులందరితో నా దేశం కోసం అతిపెద్ద వేదిక పై పోటీ పడడం, ప్రదర్శన చేయడం అపారమైన గౌరవం, సంతోషకరమైన క్షణం. ఈ అద్భుతమైన ప్రయాణంలో భాగమైనందుకు, ప్రతి అడుగులో నాకు అండగా నిలిచినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మీ ప్రోత్సాహమే నాకు ప్రపంచం! పారిస్‌లో నా ప్రచారానికి ఒక చేదు ముగింపు అయితే ఇండియా విజయానికి సహకరించినందుకు సంతోషంగా ఉంది. జై హింద్" అని మను భాకర్ రాసుకొచ్చారు.