బ‌క్రీద్​లో శానిటేషన్​పై ప్రత్యేక దృష్టి

by  |
బ‌క్రీద్​లో శానిటేషన్​పై ప్రత్యేక దృష్టి
X

దిశ, న్యూస్​బ్యూరో: క‌రోనా వైరస్‌ వ్యాప్తి నేప‌థ్యంలో బ‌క్రీద్ పండ‌గ సంద‌ర్భంగా శానిటేష‌న్‌పై ప్రత్యేక దృష్టి సారించాల‌ని జీహెచ్‌ఎంసీ అధికారుల‌కు డిప్యూటి మేయ‌ర్ మ‌హ్మద్‌ బాబా ఫ‌సియుద్దీన్ సూచించారు. గురువారం జీహెచ్‌ఎంసి ప్రధాన కార్యాల‌యంలో శానిటేష‌న్ విభాగం అద‌న‌పు క‌మిష‌న‌ర్ రాహుల్ రాజ్‌, ఇన్‌చార్జి చీఫ్ మెడిక‌ల్ ఆఫీస‌ర్ ప‌ద్మతో బ‌క్రీద్ ఏర్పాట్ల గురించి చ‌ర్చించారు. ప్రభుత్వ నిబంధ‌న‌ల ప్రకారం జంతువుల వ్యర్థాల‌ను ఎప్పటిక‌ప్పుడు తొల‌గించేందుకు అవ‌స‌ర‌మైన వాహ‌నాల‌ను అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉంచాల‌ని స్పష్టం చేశారు.

25ట‌న్నులు, 10ట‌న్నుల సామ‌ర్థ్యం గ‌ల‌ టిప్పర్లతో పాటు జేసీబీల‌తో పాటు బాబ్‌కాట్‌ల‌ను ఉప‌యోగించాల‌ని తెలిపారు. బ‌క్రీద్ సంద‌ర్భంగా భౌతిక దూరాన్ని పాటించాల‌ని ముస్లిం క‌మ్యునిటికి విజ్ఞప్తి చేశారు. జంతువుల వ్యర్థాల‌ను ఎప్పటిక‌ప్పుడు తొల‌గించేందుకు వివిధ కేట‌గిరీల‌కు చెందిన 403 వాహ‌నాల‌ను న‌గ‌ర వ్యాప్తంగా వినియోగించ‌నున్నట్లు శానిటేష‌న్ విభాగం అద‌న‌పు క‌మిష‌న‌ర్ రాహుల్ రాజ్ తెలిపారు.

Next Story

Most Viewed