భక్తులకు గుడ్ న్యూస్.. ఆ జాతరకు స్పెషల్ బస్సులు

65
kothakonda-jathara11

దిశ, హన్మకొండ చౌరస్తా: సంక్రాంతి పండుగ సందర్భంగా కొత్తకొండలో మూడు రోజులపాటు జరిగే జాతరకు హన్మకొండ జిల్లా కొత్త బస్ స్టాండ్ నుండి స్పెషల్ బస్సులను డిపో మేనేజర్ భాను కిరణ్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జాతరకు వెళ్లే భక్తుల కోసం వరంగల్, హన్మకొండ బస్ స్టాండ్ నుండి పత్యేక బస్సులను నడుపుతున్నామని అన్నారు. జాతరకు వెళ్లే భక్తులు కుటుంబ సభ్యులతో కలసి ధైవ దర్శనం అనంతరం ఒకరోజు అక్కడే ఉండి తిరుగు ప్రయాణం చేస్తారని, అందుకు అనుగుణంగా, అదేవిధంగా ప్రస్తుత కరోనా పరిస్థితుల దృష్ట్యా తగు చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రతి ప్రయాణికుడు మాస్క్ ధరించి బస్సులో ప్రయాణం చేయాలన్నారు. పెద్దలకు రూ. 50, పిల్లలకు రూ. 30 టికెట్ ధరను నిర్ణయిచ్చామన్నారు. ఈ కార్యక్రంమంలో ఎస్.ఎం.లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.