డాక్ట‌ర్స్ క్రికెట్ పోటీల‌కు సోనూసూద్‌కు ఆహ్వానం

by  |
డాక్ట‌ర్స్ క్రికెట్ పోటీల‌కు సోనూసూద్‌కు ఆహ్వానం
X

దిశ ప్ర‌తినిధి ,హైద‌రాబాద్: జ‌న‌వ‌రి 1 నుండి ఎల్బీ స్టేడియంలో గ‌వ‌ర్న‌మెంట్ మెడిక‌ల్ కాలేజ్ డాక్ట‌ర్స్ క్రికెట్ టోర్న‌మెంట్‌ జరగనుంది. ఈ టోర్నమెంట్‌కు హాజ‌రు కావాల‌ని ప్ర‌ముఖ సినీ న‌టుడు సోనూ సూద్‌ను తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ‌ చైర్మ‌న్ అల్లీపురం వెంక‌టేశ్వ‌ర్ రెడ్డి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వెంక‌టేశ్వ‌ర రెడ్డి మాట్లాడుతూ.. క‌రోనా స‌మ‌యంలో ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి వైద్యం అందించి ఎంతో మంది ప్రాణాల‌ను డాక్టర్లు కాపాడార‌ని అన్నారు. అటువంటి డాక్ట‌ర్లు పాల్గొనే క్రికెట్ పోటీల‌కు హాజ‌రై వారికి సంఘీభావం తెల‌పాల‌ని సోనూసూద్‌ను విజ్ఞ‌ప్తి చేశారు.

Next Story

Most Viewed