తండ్రి ఆకస్మిక మృతిని తట్టుకోలేక కొడుకు ఆత్మహత్య

by  |
blur
X

దిశ, చార్మినార్: తండ్రి ఆకస్మిక మృతిని తట్టుకోలేక తీవ్ర మనోవేదనకు గురయిన కొడుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్​ పరిధిలో జరిగింది. దీంతో ఒక రోజు వ్యవధిలో తండ్రి కొడుకులు మృతిచెందడంతో జహనుమాలో విషాదచాయలు అలుముకున్నాయి. ఫలక్‌నుమా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. జహనుమాకు చెందిన మీర్​ అలామా ఆలీ(70)కు ఇద్దరు కుమారులు సంతానం. పెద్దకుమారుడు దుబాయ్​లో ఉంటుండగా చిన్న కుమారుడు మీర్​ ఉస్మాన్​ ఆలీ(39) మాత్రం తండ్రితో పాటే కలిసి ఉంటున్నారు.

మీర్‌ ఉస్మాన్​ ఆలీకి భార్య, ముగ్గురు సంతానం . వృత్తిరీత్యా మెకానిక్​ అయిన మీర్‌ ఉస్మాన్​ ఆలీ తండ్రిపై ఎక్కువగా ఆధారపడి ఉన్నాడు. తండ్రి మీర్​ అలామా ఆలీ ఈ నెల 28వ తేదీన అకస్మాత్తుగా మృతిచెందాడు. దీంతో కొడుకు మీర్​ ఉస్మాన్​ ఆలీ తీవ్ర మనో వేదనకు గురయ్యాడు. తండ్రి మీర్​ అలామా అంత్యక్రియలు 29వ తేదీన మధ్యాహ్నం జరిగాయి. అంత్యక్రియల అనంతరం ఇంటికి వచ్చాక కుమారుడు ఉస్మాన్​ ఆలీ తన గదిలోకి వెళ్లి గడియ పెట్టుకున్నాడు.

రాత్రి 10గంటల వరకు తిరిగి బయటికి రాలేదు. సోదరుడు తన బట్టలు తీసుకోవడానికి గది వద్దకు వెళ్లగా ఎంతసేపు తలుపులు బాదినా తెరవకపోవడంతో అద్దాల కిటికీ బద్దలు కొట్టి చూడగా మీర్​ ఉస్మాన్​ ఆలీ చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కనిపించింది. వెంటనే ఫలక్‌నుమా పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసును నమోదు చేసుకుని ఘటనాస్థలికి చేరుకున్నారు. శవపంచనామ నిర్వహించి, మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు.



Next Story

Most Viewed