వారికి సీఎం పై పూర్తి భరోసా కలిగింది: ఎమ్మెల్యే రేగా

51

దిశా, కరకగూడెం: ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సమక్షంలో పలువురు నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెరాస ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తుందని, అందులో భాగంగా అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చిందని కొనియాడారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు, అభివృద్ధి పనులు చూసి టీఆర్ఎస్ లో చేరికలు జరుగుతున్నాయని అన్నారు.

బడుగు బలహీనవర్గాల కోసం సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలను ప్రవేశ పెడుతున్నారని తెలిపారు. ప్రజలకు సీఎం పై పూర్తి నమ్మకం భరోసా, కలిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కరకగూడెం మండలం టీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు , నాయకులు, అభిమానులు, పార్టీ ముఖ్య, తదితరులు పాల్గొన్నారు.