భర్త గురించి స్నేహ ఎమోషనల్ పోస్ట్

by  |
భర్త గురించి స్నేహ ఎమోషనల్ పోస్ట్
X

స్నేహ .. అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపించి టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ‘తొలి వలపు’ సినిమాతో తెలుగు సినీ రంగంలోకి అడుగుపెట్టిన భామ… ‘ప్రియమైన నీకు’, ‘హనుమాన్ జంక్షన్’, ‘శ్రీ రామదాసు’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతోపాటు తమిళ, మలయాళం చిత్రాల్లో నటించిన స్నేహ… 2012లో యాక్టర్ ప్రసన్నను ప్రేమ పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత తెలుగులో ‘వినయ విధేయ రామ’ చిత్రంలో రామ్‌చరణ్‌కు వదినగా కనిపించింది. సంక్రాంతికి తమిళ్ సినిమా ‘పటాస్‌’లో ధనుష్ సరసన నటించిన స్నేహ… భర్త ప్రసన్న గురించి ఎమోషనల్ స్టేటస్ పెట్టింది.

అరుణ్ విజయ్ ‘మాఫియా’ సినిమా విడుదలై సక్సెస్ ఫుల్‌గా కొనసాగుతుండగా… ఇందులో విలన్‌గా మెప్పించాడు ప్రసన్న. తన విలనిజానికి విమర్శకులు కూడా ఫిదా కాగా… భార్య స్నేహ బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇచ్చింది. ‘ మీ వర్క్ చూసి ఎప్పుడూ గర్వంగా ఫీల్ అవుతాను.. కానీ మీరు మాఫియాలో చేసిన విలన్ పాత్ర(దివాకర్ కుమరన్) చాలా ప్రభావాన్ని చూపింది అంటూ ట్వీట్ చేసింది స్నేహ. చాలా స్టైలిష్‌గా.. చాలా పర్‌ఫెక్ట్‌గా… చాలా రియల్‌గా కనిపించారని భర్తను మెచ్చుకుంది. మీరు ఎప్పటికీ బెస్ట్.. కానీ ఇది చాలా పర్‌ఫెక్ట్‌గా ఉందని, ప్రేక్షకులు మిమ్మల్ని గుర్తించినందుకు హ్యాపీగా ఉందని తెలిపింది’.

Read Also..

నితిన్‌కు బన్నీ డబుల్ కంగ్రాట్స్

Next Story

Most Viewed