41 శాతం తగ్గిన స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు

by  |
41 శాతం తగ్గిన స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 కారణంగా సుధీర్ఘమైన లాక్‌డౌన్‌తో చాలా పరిశ్రమల ఉత్పత్తి క్షీణించడంతో పాటు డిమాండ్ కూడా పడిపోయింది. దేశీయంగా 2020-21 ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు 41 శాతం పడిపోయాయి. సీఎంఆర్ ఇండియా మొబైల్ హ్యాండ్‌సెట్ మార్కెట్ రిపోర్ట్ ప్రకారం..గతేడాదితో పోలిస్తే ఈసారి ఎగుమతులు భారీగా పడిపోయాయని, అయితే, ప్రస్తుత ఏడాది రాబోయే రెండు మూడు వారాల్లో పుంజుకునే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

కొవిడ్-19తో అంతర్జాతీయంగా గందరగోళ పరిస్థితి ఏర్పడిందని…సరఫరా, డిమాండ్ రెండూ దెబ్బ తిన్నాయని..అయితే కొత్తంగా లోకల్ డెలివరీ విధానం కొంతమేరకు ఉపయోగపడిందని సీఎంఆర్ ఇండస్ట్రీ ఇంటిలిజెన్స్ గ్రూప్ హెడ్ ప్రభురాం చెప్పారు. పలు కంపెనీల బ్రాండ్లు ఉన్న ప్రాంతాల్లో వినియోగదారులకు డెలివరీ జరుగుతున్నట్టు ప్రభురాం తెలిపారు. బ్రాండ్‌లా వారీగా చూస్తే..మొత్తం ఎగుమతుల్లో రెడ్‌మీ పలు మోడళ్లు 60 శాతం వాటాను దక్కించుకోవడంతో షియోమీ కంపెనీ 30 శాతంతో మార్కెట్ లీడర్‌గా ఉంది.

తర్వాత కొరియన్ కంపెనీ శాంసంగ్ 24 శాతంతో ఈ త్రైమాసికలో 8 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది. ఇక వీవో బ్రాండ్ 17 శాతం వాటాతో స్థిరంగా కొనసాగుతోంది. అయితే, భారత మార్కెట్లోకి వచ్చిన తర్వాత రియల్‌మీ త్రైమాసిక పరంగా తొలిసారి 2 శాతం తగ్గింది. కొవిడ్-19, సరిహద్దు వివాదం నేపథ్యంలో చైనా ఉత్పాత్తులపై గణనీయమైన ప్రభావం ఉంది. ఒప్పో బ్రాండ్ సైతం త్రైమాసిక పరంగా 3 శాతం క్షీణతను నమోదు చేసింది. దీంతో మార్కెట్ వాటాలో ఐదవ స్థానంలో ఉంది. ఇక, మేజర్ బ్రాండ్ ఐఫోన్ తన మోడళ్లలో ఎస్ఈకి డిమాండ్ పెరగడంతో ఈ వరుసలో 8వ స్థానానికి చేరింది. ఇక, జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు 41 శాతం క్షీణించగా, రానున్న రోజుల్లో పండుగ సీజన్ ఉండటం పరిశ్రమకు ఆశలు కల్పిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Next Story

Most Viewed