- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కేటీఆర్ అడ్డాలో కేసీఆర్‌కు ఊహించని షాక్ (వీడియో)

దిశ, సిరిసిల్ల టౌన్: ఏదైనా రాజకీయ పార్టీ కార్యక్రమం జరిగినప్పుడు, సాధారణంగా తమ నాయకులకు అనుకూలంగా ఇతర పార్టీల నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేయటం పరిపాటి. అయితే, ఇందుకు భిన్నంగా ఆ పార్టీ నాయకులు తమ పార్టీ అధినేతనే విమర్శిస్తూ, ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తే ఎలా ఉంటుంది. అధినేతపైనే అసంతృప్తి ఉందేమోననే అనుమానాలు వస్తాయి. మంత్రి కేటీఆర్ ఇలాకాలో సోమవారం అచ్చం ఇలాంటి సంఘటనే జరిగింది. దీంతో, విస్తుపోవటం అక్కడున్న వారి వంతు కాగా, చేసిన తప్పును గమనించిన నాయకులు నాలుక కరుచుకుని, డౌన్ డౌన్, ముర్దాబాద్‌లు వీడి.. జిందాబాద్‌లు కొట్టడం ప్రారంభించారు.
కేంద్ర ప్రభుత్వం యాసంగి వడ్లు కొనుగోలు చేయమని అంటుందంటూ, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రానికి తమ నిరసనలు తెలియజేయాలని ఇచ్చిన ఆదేశానుసారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ నిరసనలను తెలియజేశారు. అందులో భాగంగా సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు, నల్ల కండువాలు వేసుకొని కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
నాయకులు, కార్యకర్తలు ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా మంచి ఊపులో నినాదాలు చేస్తున్న సమయంలో, అందులోని ఓ నాయకుడు తమ నాయకునికి జిందాబాద్ కొట్టాలనే ఉద్దేశ్యంతో, కేసీఆర్ అనగానే, అప్పటి వరకు వ్యతిరేక నినాదాలు చేసిన నాయకులు, కార్యకర్తలు అదే రీతిలో సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే గమనించిన సదరు నాయకుడు వారిని వారించి, పార్టీ నాయకులు, కార్యకర్తలు చేసిన తప్పును తెలియజేశారు. ఒక్కసారిగా కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేయడంతో అక్కడున్న వారు ఒక్కసారిగా నవ్వుకున్నారు.
- Tags
- KCR