వోక్స్‌వ్యాగన్ వెయ్యి పడకల ఆసుపత్రి!

by  |
వోక్స్‌వ్యాగన్ వెయ్యి పడకల ఆసుపత్రి!
X

దిశ, వెబ్‌డెస్క్: కోవిడ్-19తో పోరాటంలో భాగంగా ప్రముఖ కార్ల తయారీ సంస్థ స్కోడా ఆటో వోక్స్‌వ్యాగన్ పూణెలో వెయ్యి పడకల బెడ్లను ఏర్పాటు చేయడానికి ఓ ఆసుపత్రితో ఒప్పందం కుదుర్చుకుంది. దీనికోసం సాసన్ హాస్పిటల్‌కి రూ. కోటి రూపాయలు విరాళం ఇచ్చినట్టు వోక్స్‌వ్యాగన్ సంస్థ వెల్లడించింది. అంతేకాకుండా వైద్య సామగ్రి, కోవిడ్-19తో పోరాడటానికి అవసరమైన వస్తువులు, సంరక్షణ పరికరాల కోసం సహకారం అందించనున్నట్టు స్కోడా ఆటో వోక్స్‌వ్యాగన్ ఇండియా పత్రికా ప్రకటనలో తెలిపింది.

కరోనాను ఎదుర్కొనేందుకు ముందుండి పోరాడుతున్న వైద్య సిబ్బందికి అవసరమైన రీ-యూజబుల్ ఫేస్ షీల్డ్‌లను ఉత్పత్తి చేయనున్నట్టు వోక్స్‌వ్యాగన్ గ్రూప్ పేర్కొంది. వీటి తయారీని పూణెలోని చకన్ ఫ్యాక్టరీలో చేపడుతున్నట్టు, అవసరమైన సామర్థ్యంలో ఉత్పత్తి జరుగుతోందని, కోవిడ్-19 చికిత్స కోసం పనిచేస్తున్న వారికి పంపిణీ చేయబడుతుందని కంపెనీ వివరించింది. వీటితో పాటు మరిన్ని వైద్య సామగ్రిని ఇండియాకు దిగుమతి చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు కంపెనీ వెల్లడించింది.

ఓ ఎన్‌జీవో భాగస్వామ్యంతో వోక్స్‌వ్యాగన్ ఇండియా పూణెలోని సాసన్ జనరల్ హాస్పిటల్, ముంబైలోని కస్తూర్బా హాస్పిటల్, ఔరంగాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపతులలో 35,000 శానిటైజర్లను విరాళంగా ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇవి కాకుండా అదనంగా అన్నమిత్ర ఫౌండేషన్ సహకారంతో ఔరంగాబాద్ ప్రాంతంలో 50,000 వరకూ ఫుడ్ ప్యాకెట్లను పంపిణీ చేస్తామని పేర్కొంది. పెద్ద ఎత్తున ఫేస్ మాస్కులు, చేతి గ్లౌజులు, క్రిమిసంహారక మందులు, థర్మామీటర్లు, కళ్లకు గాగుల్స్, వైద్య సిబ్బందికి రక్షణ దుస్తులతో పాటు వైద్య సామగ్రిని అందివ్వనున్నట్టు వోల్క్స్‌వ్యాగన్ గ్రూప్ తెలిపింది.

Tags: Skoda Auto Volkswagen India, Volks Wagen India, Skoda Auto, Volkswagen Group, Volkswagen Group India

Next Story