- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఘోరం.. బావిలో శవాల గుట్ట.. పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య..?

దిశ, వెబ్ డెస్క్: భార్యాభర్తల మధ్యన గొడవలు సహజం. కాసేపు గొడవలు తర్వాత కలిసిపోవడం చూస్తూనే ఉన్నాం. అయితే భర్తతో గొడవపడిన భార్య ఏకంగా తన పిల్లలను తీసుకుని బావిలో దూకేసింది. దాంతో అభంసుభం ఎరుగని పసి పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. జైపూర్ కి చెందిన శివలాల్ బంజారా, బాదందేవీలకు ఏడుగురు సంతానం ఉన్నారు. అయితే శనివారం రాత్రి భార్యాభర్తలు గొడవ పడ్డారు. మనస్థాపం చెందిన బాదం దేవి తన ఏడుగురు పిల్లలో 5 గురిని తీసుకుని బావిలో దూకేసింది. మిగిలిన పిల్లలు నిద్ర పోతుండటంతో బతికిపోయారని స్థానికులు తెలిపారు.
ఆదివారం ఉదయం ఆరు శవాలను బావిలో చూసిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే భార్య చనిపోయిన రోజు తాను ఇంట్లో లేనని పొరుగూరికి వెళ్లానని శివపాల్ తెలిపాడు. విచారణ నిమిత్తం పోలీసులు అతడిని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్స్ రావాల్సి ఉంది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు.