ప్రయాణీకుల ఇక్కట్లు.. టాయ్‌లెట్ డోర్స్‌గా సిట్టింగ్ చైర్లు

by  |
ప్రయాణీకుల ఇక్కట్లు.. టాయ్‌లెట్ డోర్స్‌గా సిట్టింగ్ చైర్లు
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : నిత్యం వాహనాల రద్దీతో కిటకిటలాడే కరీంనగర్ బస్ స్టేషన్ లాక్‌డౌన్‌తో బోసి పోయింది. అయితే కొంతమంది ప్రయాణీకులు తప్పనిసరి పరిస్థితుల్లో 10 గంటల లోగా తమ గమ్యం చేరాలని భావించి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. చివరకు కరీంనగర్ బస్ స్టేషన్ చేరుకునే సరికి వారికి తీవ్ర ఇక్కడి నుండి మరో చోటకు బస్సులు వెళ్లలేక బస్ స్టేషన్‌లోనే వేచి చూసే పరిస్థితి తయారైంది. ఏదైనా వాహనం దొరకకపోతుందా అన్న ఆశతో ప్రయాణీకులు స్టేషన్‌లోనే వేచి చూస్తున్నారు. అయితే వారు కూర్చునేందుకు ఆర్టీసీ ఏర్పాటు చేసిన కుర్చీలు కాస్తా టాయ్ లెట్స్ ద్వారాలు మూసేందుకు ఉపయోగిస్తుండడం విడ్డూరం. ప్రయాణీకులు కూర్చునేందుకు ఆర్టీసీ ఏర్పాటు చేసిన కుర్చీలను నిర్భయంగా టాయ్ లెట్ నిర్వాహకులు దర్జాగా ఎంట్రన్స్ మూసేందుకు అడ్డంగా పెట్టడం ప్రయాణీకులను విస్మయపరిచింది. టాయ్ లెట్స్ లోకి ఎవరూ వెల్లకుండా డోర్ ఏర్పాటు చేసుకోకుండా ప్రయాణికులు వేచి ఉండేందుకు ఏర్పాటు చేసిన కుర్చీలను వాడుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఆర్టీసీ ఉన్నతాధికారులు ఉండే కరీంనగర్ బస్ స్టేషన్ కాంప్లెక్స్ లోనే ఈ పరిస్థితి ఉంటే ఎలా అని అంటున్న వారూ లేకపోలేదు.

ప్రయాణీకుల ఇక్కట్లు…

10 గంటల వరకే ఆర్టీసీ బస్సులు నడపుతుండడం ప్రయాణీకులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. తమ గమ్యస్థానాలకు చేరేందుకు ప్రయాణీకులు బస్సులను ఆశ్రయించినప్పటికి సకాలంలో చేరి మార్గ మధ్యలో చిక్కుకపోతున్నారు. కరీంనగర్ ఆర్టీస్ బస్ స్టేషన్ లో సుమారు వంద మంది ప్రయాణీకులు మార్గ మధ్యలో చిక్కకపోయారు. నిత్యం ఈ పరిస్థితి ఇలాగే తయారైంది. లాక్ డౌన్ తో కనీసం టీ కూడా దొరికే పరిస్థితి కూడా లేకపోవడంతో ప్రయాణీకులు నరకయాతన అనుభవిస్తున్నారు. అరగంట ముందుగా చేరుకుంటే గమ్యానికి వెల్లిపోయేవారమే అనుకుంటున్నారు. అయితే నాలుగు గంటలే బస్సులు నడుపుతుండడం వల్ల సుదూర ప్రాంతాలకు చెందిన వారికి కరీంనగర్ ఆర్టీసీ బస్ స్టేషన్ సెద తీరే కేంద్రంగా మారిపోయింది.

సిరిసిల్లకు వెల్లాలి..

ములుగు జిల్లా అడవి మల్లంపల్లి నుండి సిరిసిల్ల చేరాలని బయలు దేరా. సిరిసిల్లలో పవర్ లూం కార్మికునిగా పనిచేస్తున్నాను. వేకువ జామునే ఇంటి నుండి బయలు దేరాను కానీ కరీంనగర్ చేరుకునే సరికి 10 గంటలు దాటింది. సిరిసిల్లకు చేరుకునే పరిస్థితి కనిపిండచం లేదు. ప్రైవేటు వాహనాలు కూడా తిరగడం లేదు. రేపు ఉధయం వరకూ ఇక్కడే వెయిట్ చేయాల్సిన పరిస్థితి తయారైంది. సిరిసిల్లకు చేరుకుంటే నాకు రోజుకు రూ. 600 కూలీ రూపంలో వచ్చేవి. ఈ రోజు నేను కూలీ డబ్బు సంపాదించుకోలేకపోయాను.

-బండారి రమేష్, అడవి మల్లంపల్లి

Next Story