ఫ్లాష్.. ఫ్లాష్.. సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూత

by  |
ఫ్లాష్.. ఫ్లాష్.. సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూత
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నృత్య దర్శకుడు శివశంకర్ మాస్టర్ మరణం మరువకముందే మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ టాలీవుడ్ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారు. న్యూమోనియాతో సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. న్యూమోనియాతో బాధపడుతున్న ఆయనను ఈ నెల 24న కిమ్స్ ఆస్పత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు. అప్పటినుంచి ఐసీయూలో ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తుండగా.. ఆరోగ్యం మరింత విషమించడంతో కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని కిమ్స్ హాస్పిటల్స్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సంబిత్ సాహు అధికారికంగా ప్రకటించారు.

సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణంతో టాలీవుడ్ లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన మరణం పట్ల టాలీవుడ్ సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం ప్రకటిస్తున్నారు.

Read more : 1. సిరివెన్నెల ప్రస్థానం సాగిందిలా..

2. హుజురాబాద్‌లో మనుషులను తినే నరభక్షకులు.. క్లారిటీ ఇచ్చిన పోలీసులు



Next Story