ఆ వ్యసనాన్ని వదల్లేకపోయా.. దాని ముందు తలవంచా.. గతంలో సిరివెన్నెల మాటలు

by Anukaran |   ( Updated:2021-11-30 07:16:33.0  )
ఆ వ్యసనాన్ని వదల్లేకపోయా.. దాని ముందు తలవంచా.. గతంలో సిరివెన్నెల మాటలు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో చికిత్స పొందుతూ మరణించినట్లు కిమ్స్ వైద్యులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆరేళ్ల క్రితం క్యాన్సర్‌తో ఊపిరితిత్తుల్లో కొంతభాగం వైద్యులు.. ఆ తర్వాత బైపాస్ సర్జరీ చేశారు. అయితే మరోసారి ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ వచ్చిందని, రెండ్రోజులు బాగానే ఉన్నారని కిమ్స్ హాస్పిటల్ ఛైర్మన్ డా.భాస్కర్ రావు తెలిపారు. ఐదురోజుల పాటు ఎక్మో మెషీన్‌పై చికిత్స అందించామని, కిడ్నీ డ్యామేజ్‌తో శరీరం ఇన్‌ఫెక్షన్‌ అయిందన్నారు. మెరుగైన చికిత్స అందించినా ఫలితం దక్కలేదన్నారు.

ఈ క్రమంలో గతంలో సిగరెట్ అలవాటు గురించి సిరివెన్నెల చెప్పిన మాటలను పలువురు గుర్తుచేస్తున్నారు. సిగరెట్ తనకు బలహీనత అని, ఆ వ్యసనాన్ని వదల్లేకపోయానని గతంలో ఓ ఇంటర్వ్యూలో సిరివెన్నెల అన్నారు. సరదాగానే స్మోకింగ్ మొదలుపెట్టానని, సిగరెట్ ముందు ప్రతిసారీ తలవంచానని చెప్పారు. ఊపిరిత్తుల క్యాన్సర్‌తో సిరివెన్నెల మృతి చెందిన నేపథ్యంలో గతంలో తన స్మోకింగ్ అలవాటు గురించి ఆయన చెప్పిన మాటలు చర్చనీయాంశంగా మారాయి.

Next Story