నాకు మావోయిస్టుల నుంచి సమాచారం లేదు.. ఆర్కే భార్య సంచలన ప్రకటన

by  |
Maoist leader Ramakrishna wife shireesha
X

దిశ, వెబ్‌డెస్క్: మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ సభ్యుడు, ఆంధ్రా-ఒరిస్సా బోర్డర్ స్సెషల్ జోనల్ ఇన్‌చార్జి అక్కిరాజు హరగోపాల్(63) అలియాస్ రామకృష్ణ(ఆర్కే) అనారోగ్యంతో మృతిచెందాడని ఛత్తీస్‌ఘడ్‌లోని బీజాపూర్ పోలీసులు మీడియాకు సమాచారం అందించిన విషయం తెలిసిందే. తాజాగా.. ఆర్కే మృతిపై ఆయన భార్య శిరీష స్పందించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నా భర్తది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని ఆరోపించారు. ఆయన మరణించాడని ఛత్తీస్‌ఘడ్ డీజీపీ ప్రకటించారు కానీ, నా భర్త చనిపోయినట్లు మావోయిస్టుల నుంచి నాకు ఎలాంటి సమాచారం లేదని వెల్లడించారు.

తన భర్త మృతదేహాన్ని అప్పగిస్తే చివరిచూపు చూసుకుంటానని వేడుకుంటున్నారు. కాగా, దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో పోలీసులు-మవోయిస్టుల మధ్య జరిగిన చర్చల్లో రామకృష్ణ కీలక పాత్ర పోషించారు. అనేక సమయాల్లో పెద్ద పెద్ద ఎన్‌కౌంటర్ల నుంచి చివరి నిమిషంలో ఆయన తప్పించుకున్నారు. భారీ ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రతీ సందర్భాల్లోనూ ఆర్కే చనిపోయారా? లేదా బతికే ఉన్నారా? అనే చర్చ కూడా సాగుతూ వచ్చింది.


Next Story

Most Viewed