వారి బ్రేకప్‌కు నాకు సంబంధం లేదు.. ఎట్టకేలకు నోరువిప్పిన బ్యూటీ..

471
SIRI

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం ఇండస్ట్రీలో విడాకుల ట్రెండ్ నడుస్తోంది. ఎంత త్వరగా ప్రేమలో పడుతున్నారో.. అంతే స్పీడ్‌గా విడాకులు తీసుకుంటున్నారు. టాలీవుడ్ స్టార్ జోడి అక్కినేని నాగచైతన్య, సమంత విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా.. వీరి దారిలోనే యూట్యూబ్ స్టార్ షణ్ముక్ జస్వంత్, బిగ్‌బాస్ హాట్ బ్మూటీ దీప్తి సునైనా తమ ప్రేమ బంధానికి స్వస్తి చెప్పారు. వీరి బ్రేకప్‌కు కారణం బిగ్‌బాస్ 5లో షణ్ముక్, సిరిల వ్యవహారమే అని నెటిజన్‌లు కామెంట్స్ చేస్తున్నారు. దీప్తి సునైనా, షణ్ముక్ అధికారికంగా వారు విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. దీనితో నెటిజన్‌లు వారు విడిపోవడానికి కారణం సిరి అని ఆమెను విపరీతంగా ట్రోల్ చేశారు. తాజాగా వీటిపై సిరి స్పందించింది.

‘దీప్తి, షణ్ముక్ బ్రేకప్‌కు కారణం నేను కాదు. నా వల్లే వారు విడిపోయారు అనేది అవాస్తం. అలా అనడం కరెక్ట్ కాదు. అయినా కేవలం 100 రోజుల్లోనే విడిపోయేంత వీక్ ప్రేమ కాదు వారిది అని తెలిపింది.’