సమంతను హెచ్చరించిన సిద్ధార్థ్.. ఫ్యాన్ గ్రూప్‌ను పెంచి పోషిస్తున్నావా అంటూ.. 

by  |
sam and siddu
X

దిశ, సినిమా : హీరోయిన్ సమంత ప్రతి రోజు వార్తల్లో నిలుస్తోంది. తన ప్రజెంట్ లేదంటే పాస్ట్ ఏదో ఒక విధంగా హెడ్ లైన్స్ టచ్ చేస్తూనే ఉంది. ముఖ్యంగా చైతుతో విడాకుల విషయాన్ని యాడ్ చేస్తూ రోజుకో విషయాన్ని తెరమీదకు తీసుకొస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడిన సామ్.. వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న పరిణామాలు తను నిర్మించుకున్న కలల ప్రపంచాన్ని చిదిమేశాయని చెప్పింది. ఈ క్రమంలో కొందరు అభిమానులు సోషల్ మీడియా వేదికగా మద్దతిస్తుంటే.. మరికొందరు అసభ్యకర మెసేజ్‌లతో మరింత కుంగిపోయేలా చేస్తున్నారని తెలిపింది.

కాగా ఈ విషయంపై స్పందించిన సిద్ధార్థ్.. ట్విట్టర్ వేదికగా ఘాటుగా రిప్లయ్ ఇచ్చాడు. ‘నేటి టాక్సిక్ సోషల్ మీడియా ప్రపంచంలో స్టార్స్ సొంతంగా ఫ్యాన్ గ్రూప్స్‌నే ఏర్పాటు చేసుకునేందుకు ఖర్చు పెడుతున్నారని అభిప్రాయపడ్డాడు. ఏది తనంతట తానే జరగదన్న సిద్ధు.. తాము పెంచిపోషించిన అభిమానులే చివరకు కాటేస్తారన్న విషయాన్ని గుర్తించడం మంచిదనే విధంగా ట్వీట్ చేశాడు. దీంతో ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు.. సమంతను హెచ్చరించేందుకే ఈ ట్వీట్ చేశాడని అంటున్నారు.

‘ఓ అంటావా.. ఓ ఓ అంటావా..’ అంటున్న సమంత బోల్డ్ అవతార్‌



Next Story

Most Viewed