ఎస్ఐ గోవింద్‎పై సస్పెన్షన్ వేటు

by  |
ఎస్ఐ గోవింద్‎పై సస్పెన్షన్ వేటు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: కామారెడ్డి జిల్లా బెట్టింగ్ వసూళ్ల వ్యవహారంలో మరో వికెట్ పడింది. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ కేసులో అవినీతి ఆరోపణలపై ఏసీబీ అధికారులు ఈ నెల 21న కామారెడ్డి పట్టణ సీఐ జగదీష్‎ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కామారెడ్డి డీఎస్పీ, ఎస్ఐలతో పాటు పలువురు అధికారులు సైతం ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అయితే స్థానిక ఎస్ఐ గోవింద్‎పై ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రచారం జరగగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ కేసులో బాధితుడు సుధాకర్ నుంచి రూ.20 వేలు వసూలు చేసి కామారెడ్డి పట్టణ ఎస్ఐ గోవింద్ అవినీతికి పాల్పడినట్లు విచారణలో తేలింది. దీంతో ఈ నెల 26వ తేదీన ఏసీబీ అధికారులు ఎస్ఐ గోవింద్‎ను అరెస్ట్ చేశారు. ఈ మేరకు గోవింద్‎ను సస్పెన్షన్ చేస్తూ నిజామాబాద్ రేంజ్ ఐజీపీ శివశంకర్ రెడ్డి ఉత్తర్వులను జారీ చేశారు. ఈ కేసులో ఇంకా పోలీస్ అధికారులు ఉన్నారనే కోణంలో ఎంత అక్రమాస్తులు కూడబెట్టారనే కోణంలో ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.



Next Story

Most Viewed