అడుగడుగునా నిర్లక్ష్యం.. ఉపాధి హామీ అధికారులకు నోటీసులు జారీ

by  |
అడుగడుగునా నిర్లక్ష్యం.. ఉపాధి హామీ అధికారులకు నోటీసులు జారీ
X

దిశప్రతినిధి, మేడ్చల్ : మేడ్చల్ జిల్లాలో ఉపాధి హామీ పథకం అమలులో అనుకున్న ప్రగతిని సాధించడం లేదని జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ శాఖ అధికారి పద్మజా రాణి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ హరీశ్ అదేశాల మేరకు జిల్లాలోని ఎంపీడీఓలు, ఏపీఓలు, ఈసీలు, టీఏలకు నోటీసులు జారీ చేసినట్లు మంగళవారం ఆమె ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పంచాయతీ రాజ్ కమిషనర్ ప్రతీ గ్రామ పంచాయతీకు రోజుకు కనీసం 25 మంది వేజ్ సీకర్స్‌ను సమీకరించి ఉపాధి హామీ పనులలో పురోగతి సాధించాలని సూచించినా.. సంబంధిత జిల్లా అధికార యంత్రాంగం ఆ దిశగా పనులు చేపట్టడంలేదన్నారు. ఉపాధి హామీ పథకం అమలులో నిర్దేశించిన లక్ష్యాన్ని అధిగమించడంలో విఫలమైనందున వివరణ కోరుతూ, అధికారులకు షోకాజ్ నోటీసులు చేసినట్లు ఆమె తెలిపారు.

నోటీస్ జారీ చేయడంలో నిర్లక్ష్యంపై..

నోటీస్ జారీ చేయడంలో నిర్లక్ష్యం వహించడంపై కీసర ఎంపీడీఓకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కీసర మండలం, అంకిరెడ్డి పల్లి సర్పంచ్ విమల 7వ విడుత హరితహారంలో భాగంగా గ్రామంలో మొక్కలు నాటించడంలో నిర్లక్ష్యం వహించినందుకు 2021, సెప్టెంబర్ 30న జిల్లా వివరణ కోరుతూ నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసును సర్పంచ్‌కు అందజేయాలని, ఈ మెయిల్ ద్వారా కీసర ఎంపీడీఓ పద్మావతిని కలెక్టర్ ఆదేశించారు. అయితే, ఎంపీడీఓ సర్పంచ్‌కు నోటీసును అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహారించినందును వివరణ కోరుతూ షోకాజ్ నోటీసు జారీ చేశారు.


Next Story

Most Viewed