తెలంగాణ నెక్ట్స్ సీఎం రేవంత్ రెడ్డి.. సంచలనం రేపుతున్న సర్వే..!

by  |
తెలంగాణ నెక్ట్స్ సీఎం రేవంత్ రెడ్డి.. సంచలనం రేపుతున్న సర్వే..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో సర్వేల జోరు సాగుతోంది. పార్టీల వారీగా ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. దీనికి తోడుగా ప్రైవేట్​సంస్థలు కూడా రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపు ఎవరిది.. సీఎం ఎవరంటూ ప్రజాభిప్రాయ సేకరణ చేస్తోంది. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉన్నా.. రాష్ట్రంలో సర్వేల్లో పాల్గొంటున్న వారు మాత్రం రేవంత్​రెడ్డి, కాంగ్రెస్​పార్టీకి సపోర్టుగా ఉంటున్నారు. ఇది ఎన్నికల వరకు ఎలా కొనసాగుతుందనేది ప్రశ్నార్థకమే.

పోటీ వీరికే..!

రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్‌తో పోటీ ఉండదని పలు సర్వేల్లో తేలుతోంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ ఉంటుందని భావిస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందని, ఇదే సమయంలో కాంగ్రెస్​పుంజుకోవడం టీఆర్ఎస్, బీజేపీకి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయంటూ సర్వేలో తేలినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పోటీ బీజేపీ, టీఆర్ఎస్ మధ్య కాకుండా.. బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఉంటుందని తేలింది.

కాంగ్రెస్‌కు 49 నుంచి 54 సీట్లు, టీఆర్ఎస్‌కు 14 నుంచి 16 సీట్లు వస్తాయని హస్తం నేతల సర్వేలో వెల్లడైందంటున్నారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఈ సర్వే చేపట్టినట్లు రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ సర్కారు పనితీరు బాగుందని 19.9 శాతం మంది చెబితే.. ఫర్వాలేదని 38.1 శాతం మంది, బాగోలేదని 39.8 శాతం మంది, చెప్పలేమని 2.2 శాతం మంది చెప్పారు. సీఎం కేసీఆర్ పనితీరు బాగుందని 21.4 శాతం మంది, ఫర్వాలేదని 33.3 శాతం మంది, బాగోలేదని 43.4 శాతం మంది, చెప్పలేమని 2 శాతం మంది చెప్పినట్లు కాంగ్రెస్​సర్వే వెల్లడించింది.

అదే విధంగా ఓటింగ్ షేరింగ్ విషయానికి వస్తే.. కాంగ్రెస్‌కు 37.8 శాతం ఓట్లు, బీజేపీకి 31.4 శాతం వస్తే.. టీఆర్ఎస్‌ 13.5 శాతం ఓట్లకే పరిమితం కానుందని సర్వేలో వచ్చినట్లు చెబుతున్నారు. మజ్లిస్ 14.2 శాతం ఓట్లు వస్తాయని తేలిందంటున్నారు. ప్రస్తుత సర్వే ప్రకారం కాంగ్రెస్‌కు 49 నుంచి 54 సీట్లు, బీజేపీకి 43-47 సీట్లు, టీఆర్ఎస్‌కు 14-16, ఏఐఎంఐఎంకు 7-10 సీట్లు, ఇతరులకు 0-2 సీట్లు వస్తాయని ఈ సర్వే వెల్లడించింది. అయితే ఈ సర్వేను కొన్ని రాజకీయ వర్గాలు సమర్ధిస్తున్నా.. మరికొన్ని పక్షాలు మాత్రం అనుమానిస్తున్నాయి.

రేవంత్​రెడ్డికి అవకాశం..

వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్​రెడ్డికి అవకాశం ఉందని సర్వేలో తేలింది. రేవంత్​రెడ్డికి 70 శాతం, కేసీఆర్‌కు 18 శాతం, బండి సంజయ్‌కు 7 శాతం, ఇతరులకు 5 శాతం అవకాశం ఉంటుందంటున్నారు. అయితే సీట్లు తక్కువగా వచ్చినా.. కేసీఆర్​సీఎం అవుతారంటూ ఈ సర్వేలో తేలిందని చెబుతున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడిదే ట్రెండింగ్​న్యూస్.


Next Story

Most Viewed