'డబ్బు సంపాదించడం సర్కారు పని కాదు'

by  |
డబ్బు సంపాదించడం సర్కారు పని కాదు
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రం నౌకాశ్రయాల ఆధార పరిశ్రమల అభివృద్ధి కోసం ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. దీనికోసం దేశంలో ఉన్న 12 ప్రధాన నౌకాశ్రయాలకు అనుబంధంగా 1.10 లక్షల హెక్టార్ల భూమిని కేటాయించనున్నట్టు కేంద్ర షిప్పింగ్ శాఖ మంత్రి మన్‌సుఖ్ చెప్పారు. దీంతోపాటు కార్గో నిర్వహణను పెంచేందుకు కూడా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఏపీలోని విశాఖ పోర్ట్, ముంబై, జేఎన్‌పీటీ, మార్మగోవా, కొచ్చిన్, కామరాజ్, న్యూ మంగళూర్, చెన్నై, పారాదీప్, కోల్‌కతా నౌకాశ్రయాల దగ్గరలో పారిశ్రామికవాడల అభివృద్ధి చేయాలని ఈ ప్రణాళికలో ఉన్నట్టు తెలుస్తోంది. దేశంలోని ప్రధాన ఓడరేవు ప్రాంతాల్లో 1.10 లక్షల హెక్టార్ల భూమి ఉండగా, ఇందులో కొంత పరిశ్రమలు, పారిశ్రామిక అభివృద్ధికి ఉపయోగించనున్నట్టు, ఆయా పోర్ట్‌లలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రక్రియ గుర్తించనున్నట్టు మంత్రి వివరించారు. ఇప్పటివరకు ఆయా ఓడరేవులకు చెందిన భూమిని ఆదెలకు ఉపయోగించినట్టు, అయితే, ఈ భూమి ద్వారా డబ్బు సంపాదించడం ప్రభుత్వం పని కాదని, అందుకే పరిశ్రమల అభివృద్ధి కోస, వీటి ద్వారా ఉపాధి కల్పన, కార్గో పెంపు, దేశీయ ఉత్పత్తిని పెంచడానికి ఉపయోగిస్తామని మంత్రి తెలిపారు.

Next Story

Most Viewed