ఆడబిడ్డకు జన్మనిచ్చిన శిల్పాశెట్టి

by  |
ఆడబిడ్డకు జన్మనిచ్చిన శిల్పాశెట్టి
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శిల్పా‌శెట్టి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఫిబ్రవరి 15న పుట్టిన బిడ్డకు సమీషా శెట్టి కుంద్రాగా నామకరణం చేసింది. ఈ విషయాన్ని శుక్రవారం అభిమానులకు తెలిపింది. ‘మా పూజలు ఫలించాయి. ఆ గణేషుడు మా జీవితాల్లో అద్భుతం చేశాడు. కూతురి రూపంలో మా ఇంటికి దేవతను పంపించాడు’ అని సంతోషాన్ని వ్యక్తం చేసింది. సమీషా అంటే లక్ష్మీదేవి అనే అర్థం వస్తుందని తెలిపిన శిల్పాశెట్టి తన రాకతో మా కుటుంబం పరిపూర్ణమైంది’ అని తెలిపింది. ఈ చిన్నారికి మీ ఆశీర్వాదం అందించాలని కోరింది.

కాగా.. శిల్పాశెట్టి. రాజ్‌కుంద్రా దంపతులకు ఇప్పటికే కొడుకు వియాన్ రాజ్‌కుంద్రా ఉండగా, ఇప్పుడు కూతురు జన్మించడంతో సంబరాలు చేసుకుంటున్నారు. మహాలక్ష్మి ఇంటికి వచ్చిందంటూ ఆనందపడుతున్నారు. కాగా, విక్టరీ వెంకటేష్ సరసన సాహస వీరుడు సాగర కన్యలో నటించి తెలుగులో గుర్తింపు తెచ్చుకుంది శిల్పాశెట్టి.

Next Story

Most Viewed